T20 World Cup 2021: భారత్, పాక్ మధ్య తొలి పోరు.. పూర్తి షెడ్యూల్ ఇదే..

ICC Men's T20 World Cup: క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పింది ఐసీసీ. టీ20 వరల్డ్‌కప్ అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 మధ్య జరగనుంది. ఇప్పటికే గ్రూప్స్ లిస్ట్ ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. ఇక తాజాగా దుబాయ్‌లో జరగనున్న ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. భారత్ తన తొలి మ్యాచ్‌ను దాయాది పాకిస్థాన్‌తోనే ఆడబోతోంది.టీమిండియా తన తొలి మ్యాచ్‌ను దాయాది పాకిస్థాన్‌తోనే ఆడబోతోంది. ఇక గ్రూప్ 2లో భాగంగా అక్టోబర్ 24న ఇండియా, పాకిస్థాన్ మధ్య దుబాయ్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 23న అసలు టోర్నీ అంటే సూపర్ 12 స్టేజ్ ప్రారంభమవుతుంది. అబుదాబిలో జరగబోయే తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా తలపడతాయి.
అక్టోబర్ 17న రౌండ్ 1లో గ్రూప్ బిలోని ఒమన్, పపువా న్యూ గినియా మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. అదే రోజు స్కాట్లాండ్, బంగ్లాదేశ్ మరో మ్యాచ్‌లో తలపడనున్నాయి. అక్టోబర్ 17న దుబాయ్‌లో సాయంత్రం ఇంగ్లండ్, వెస్టిండీస్ ఆడనున్నాయి. టీమిండియా అక్టోబర్ 31న న్యూజిలాండ్‌తో, నవంబర్ 3న ఆఫ్ఘనిస్థాన్‌తో, నవంబర్ 5న గ్రూప్ బిలో టాప్ పొజిషన్‌లో నిలిచిన టీమ్ తో మ్యాచ్ ఆడనుంది. నవంబర్ 8న గ్రూప్ ఎలో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో ఆడాల్సి ఉంది. నవంబర్ 10న అబుదాబిలో తొలి సెమీస్.. నవంబర్ 11న దుబాయ్‌లో రెండో సెమీస్ జరుగుతుంది. రెండు సెమీఫైనల్స్‌కు రిజర్వ్ డే ఉంటుంది. ఫైనల్ నవంబర్ 14న దుబాయ్‌లో జరగుతుంది. మరుసటి రోజును రిజర్వ్ డేగా ఉంచారు.ఈ మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకే ప్రారంభమవుతాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com