ICC Rankings:టాప్‌-10లో రోహిత్‌, కోహ్లీ 14, తొలిసారి జైశ్వాల్ ఎంట్రీ..

ICC Rankings:టాప్‌-10లో రోహిత్‌, కోహ్లీ 14, తొలిసారి జైశ్వాల్ ఎంట్రీ..
X
విరాట్ కోహ్లీ 14వ స్థానంలోనే కొనసాగుతున్నాడు.

ICC Rankings: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఐసీసీ(ICC) టెస్ట్ ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్‌ విభాగంలో టాప్‌-10లోకి మళ్లీ వచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న విండీస్‌ టెస్ట్ సిరీస్‌లో తన 10వ సెంచరీ చేసి ర్యాంకింగ్స్‌లో 10వ స్థానంలో నిలిచాడు. మొదటి టెస్ట్‌లోనే సెంచరీ చేసిన యువసంచలనం యశస్వి జైశ్వాల్(Yashaswi Jaiswal) కూడా తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో మొదటిసారి ప్రవేశించి 73వ స్థానం దక్కించుకున్నాడు.

ఇటీవల జరిగిన మొదటి టెస్ట్‌లో ఈ భారత ఓపెనర్లిద్దరూ సెంచరీలతో విజృంభించడంతో మొదటి టెస్ట్‌లో భారత్ ఘన విజయం సాధించింది.


రోహిత్ 103 పరుగులు చేయడంతో టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 3 స్థానాలు మెరుగుపరుచుకుని 10వ స్థానంలో ఉన్నాడు. కొన్ని పాయింట్ల తేడాతో, గాయం కారణంగా మ్యాచ్‌లు ఆడని వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్(Rishab Panth) 11వ స్థానంలో నిలిచాడు. విరాట్ కోహ్లీ(Virat Kohli) 14వ స్థానంలోనే కొనసాగుతున్నాడు. 387 బంతుల్లో 171 పరుగులు చేసిన యశస్వి జైశ్వాల్ 73వ ర్యాంకులో నిలిచాడు. న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్(Kane Williamson) మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.


టెస్ట్ బౌలింగ్ విభాగంలో భారత ఆల్ రౌండర్, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravi Ashwin) విండీస్‌తో 12 వికెట్లు తీయడంతో 24 రేటింగ్ పాయింట్లను పెంచుకుని మొత్తంగా 884 పాయింట్లతో బౌలర్ల ర్యాంకింగ్‌లో తన నంబర్ 1 స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. 2వ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమ్మిన్స్(Pat Cummins) కన్నా 56 పాయింట్ల తేడా ఆధిక్యంలో ఉన్నాడు. మరో భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) 3 స్థానాలు ఎగబాకి 7వ స్థానంలో నిలిచాడు. పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా(Jaspreeth Bumrah) 1 స్థానం దిగజారి 10వ స్థానంలో నిలిచాడు. టెస్ట్ ఆల్‌ రౌండర్లలో రవీంద్ర జడేజా, రవిచంద్ర అశ్విన్‌లు మొదటి, రెండవ స్థానాల్లో ఎటువంటి మార్పు లేకుండా కొనసాగుతున్నారు. మరో స్పిన్నర్ అక్షర్ పటేల్ 5వ స్థానంలో నిలిచాడు.




Tags

Next Story