Cricket WorldCup: వరల్డ్‌ కప్ ట్రోఫీని దగ్గర నుంచి చూసే అవకాశం..

Cricket WorldCup: వరల్డ్‌ కప్ ట్రోఫీని దగ్గర నుంచి చూసే అవకాశం..
18 దేశాల్లో 40 నగరాలకు పైగా 100 రోజుల పర్యటన

కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న క్రికెట్ వరల్డ్‌కప్ అక్టోబర్‌లో ప్రారంభమవనుంది. స్వదేశంలో జరగనున్న ఈ మెగా ఈవెంట్‌లో ఎన్నో ఆశలతో భారత కెప్టెన్ రోహిత శర్మ నాయకత్వంలో బరిలో దిగనుంది. జూన్ 26న ఎవరూ ఊహించని రీతిలో వినూత్నంగా అంతరిక్షంలో భూమి నుంచి 1 లక్షా 20వేల అడుగుల ఎత్తులో స్ట్రాటోస్పియర్ ఆవరణలో ట్రోఫీని ఆవిష్కరించి అందరినీ అశ్చర్యపరిచింది. అనంతరం ట్రోఫీని అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియంలో ల్యాండింగ్‌ చేశారు. వరల్డ్‌కప్ ట్రోఫీని అందరికీ చేరువచేయాలనే ఉద్దేశ్యంతో ఐసీసీ 2023 వరల్డ్‌కప్ టూర్‌ని ప్రారంభించింది. 18 దేశాల్లో 40కి పైగా నగరాల్లో ఈ టూర్ సాగనుంది.


ఈ కార్యక్రమం మంగళవారం ముంబాయికి చేరింది. మాహిమ్ ప్రాంతంలోని బాంబే స్కాటిష్ పాఠశాలలో ట్రోఫీని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి మహామహులైన మాజీ క్రికెటర్లు, రంజీ క్రికెటర్లు, క్రికెట్‌ అభిమానులు కప్‌ని చూసి ఆనందంలో మునిగారు. పాఠశాల విద్యార్థులు, క్రికెట్ అభిమానులు ఐకానిక్ ట్రోఫీని దగ్గరి నుంచి చూడటంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ముంబాయి మాజీ కెప్టెన్, క్రికెట్ లెజెండ్ మిలింద్ రిజి, భారత మాజీ పేసర్ రాజు కులకర్ణి, ముంబాయి స్కూల్ స్పోర్ట్స్‌ అసోసియేషన్ సెక్రెటరీ నదీం మీనన్‌లు పాల్గొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు, ఔత్సాహికులకు ICC పురుషుల వరల్డ్‌కప్ మెగా ఈవెంట్ విశేషాలు తెలియజేయడానికి, టోర్నీతో బలమైన బంధం ఏర్పరచడానికి, మరింత ఆసక్తిని పెంచడానికి ఈ టూర్‌ని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ దిగ్గజాలు, అభిమానులు, ప్రముఖులను దగ్గరి చేసి ఒక వేడుకలా జరిపేలా ఈ టూర్‌కి ప్రణాళిక రూపొందించారు.


ట్రోఫీ టూర్ పూర్తి షెడ్యూల్

జూన్ 27 నుండి జూలై 14 వరకు: భారతదేశం

జూలై 15 నుండి జూలై 16 వరకు: న్యూజిలాండ్

జూలై 17 నుండి జూలై 18 వరకు: ఆస్ట్రేలియా

జూలై 19 నుండి జూలై 21 వరకు: పాపువా న్యూ గినియా

జూలై 22 నుండి జూలై 24 వరకు: భారతదేశం

జూలై 25 నుండి జూలై 27 వరకు: USA

జూలై 28 నుండి జూలై 30 వరకు: వెస్టిండీస్

జూలై 31 నుండి ఆగస్టు 4 వరకు: పాకిస్తాన్

ఆగస్టు 5 నుండి ఆగస్టు 6 వరకు: శ్రీలంక

ఆగస్టు 7 నుండి ఆగస్టు 9 వరకు: బంగ్లాదేశ్

ఆగస్టు 10 నుండి ఆగస్టు 11 వరకు: కువైట్

ఆగస్టు 12 నుండి ఆగస్టు 13 వరకు: బహ్రెయిన్

ఆగస్టు 14 నుండి ఆగస్టు 15 వరకు: భారతదేశం

ఆగస్టు 16 నుండి ఆగస్టు 18 వరకు: ఇటలీ

ఆగస్టు 19 నుండి ఆగస్టు 20 వరకు: ఫ్రాన్స్

ఆగస్టు 21 నుండి ఆగస్టు 24 వరకు: ఇంగ్లండ్

ఆగస్టు 25 నుండి ఆగస్టు 26 వరకు: మలేషియా

ఆగష్టు 27 నుండి ఆగస్టు 28 వరకు: ఉగాండా

ఆగస్టు 29 నుండి ఆగస్టు 30 వరకు: నైజీరియా

ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 3 వరకు: దక్షిణాఫ్రికా

సెప్టెంబర్ 5 నుండి: భారతదేశం


అక్టోబర్‌ 5న అహ్మదాబాద్‌లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య మొదటి మ్యాచ్‌తో ICC వరల్డ్‌కప్ ప్రారంభమవనుంది.

భారత్ తన తొలి మ్యాచ్‌ను చెన్నైలో అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ఢీకొట్టనుంది. ఈ వరల్డ్‌కప్‌లో భారత్‌, పాక్ మ్యాచ్‌ అక్టోబర్‌ 15న అహ్మదాబాద్‌లో జరగనుంది. ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.


Tags

Read MoreRead Less
Next Story