ICC: ఐసీసీ కొత్త రూల్స్.. ఎవరికి లాభం..?

ICC: ఐసీసీ కొత్త రూల్స్.. ఎవరికి లాభం..?
X
పాత రూల్స్‌ను మార్చిన ఐసీసీ.. స్టాప్‌ క్లాక్‌ సహా కీలక నిబంధనలు అమల్లోకి

క్రి­కె­ట్‌­ను మరింత ఆస­క్తి­క­రం­గా మా­ర్చ­డా­ని­కి... క్రి­కె­ట్‌ ప్రే­మి­కు­ల­కు మరింత జోష్ ఇచ్చేం­దు­కు అం­త­ర్జా­తీయ క్రి­కె­ట్ మం­డ­లి కీలక ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. ఆటను రస­వ­త్త­రం­గా మా­ర్చేం­దు­కు ఎప్ప­టి­క­ప్పు­డు నయా రూ­ల్స్ తీ­సు­కొ­చ్చిం­ది. ఒక్కో­సా­రి ఉన్న ని­బం­ధ­న­ల­నే సడ­లిం­చే క్రి­కె­ట్ బో­ర్డు.. అవ­స­రా­న్ని బట్టి నయా రూ­ల్స్ కూడా తీ­సు­కొ­స్తుం­ది. తా­జా­గా కొ­న్ని పాత రూ­ల్స్‌­ను మా­ర్చ­డ­మే గాక కొ­న్ని కొ­త్త ని­బం­ధ­న­ల­ను కూడా ప్ర­వే­శ­పె­ట్టిం­ది ఐసీ­సీ. ఈ రూ­ల్స్ క్రి­కె­ట్‌­లో కీలక మా­ర్పు­ల­కు అం­కు­రా­ర్పణ చేసే అవ­కా­శం ఉంది.

బౌండరీ క్యాచ్

బౌం­డ­రీ లైన్ దాటి గా­ల్లో బం­తి­ని అం­దు­కుం­టే తి­రి­గి ఒకే ప్ర­య­త్నం­లో మై­దా­నం­లో­కి వి­స­రా­లి. వి­సి­రిన వెం­ట­నే గ్రౌం­డ్‌­లో­కి వచ్చి క్యా­చ్ అం­దు­కో­వా­లి. లే­క­పో­తే దా­న్ని సి­క్స్‌­గా పరి­గ­ణి­స్తా­రు. వివాదాలు రేగుతున్న నేపథ్యంలో ఈ విషయంపై సమీక్షించి కొత్త నియమాన్ని తీసుకొచ్చింది మెరీల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ). ఈనెల నుంచే ఈ కొత్త నిబంధన అమలు కాబోతోంది. క్యాచ్‌ను పట్టుకునే క్రమంలో తాను బౌండరీ లైన్‌ దాటే అవకాశముందని ఫీల్డర్‌ భావిస్తే అది దాటే లోపు బంతిని లోపలే గాల్లోకి వేసి, లైన్‌ బయటి నుంచి మళ్లీ లోపలికి వచ్చి క్యాచ్‌ పట్టవచ్చు. నిబంధనల ప్రకారం ఇది సరైన క్యాచే. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. లైన్‌ ఆవల ఫీల్డర్‌ ఏ విధంగా బంతిని తాకినా అది నాటౌట్‌ కిందే లెక్క.

షార్ట్ రన్

క్రీ­జు­లో బ్యా­ట్ పె­ట్ట­కుం­డా ఉద్దే­శ­పూ­ర్వ­కం­గా రన్ పూ­ర్తి చే­య­క­పో­తే 5 పరు­గు­లు పె­నా­ల్టీ వి­ధి­స్తా­రు. కా­వా­ల­ని ఇలా పరి­గె­డి­తే పె­నా­ల్టీ వి­ధిం­చ­డ­మే కాదు.. ఇంకో మె­లిక కూడా పె­ట్టిం­ది ఐసీ­సీ. ఆ తర్వా­తి బం­తి­ని ఏ బ్యా­ట­ర్ ఆడా­ల­నే­ది ఫీ­ల్డిం­గ్ జట్టు ని­ర్ణ­యిం­చే­లా చే­సిం­ది.

స్టాప్ క్లాక్ రూల్

ఓవర్ ము­గి­సిన తర్వాత.. మరో ఓవ­ర్‌­ను 60 సె­క­న్ల­లో­పు ఆరం­భిం­చా­ల్సి ఉం­టుం­ది. ఈ ని­బం­ధన ఉల్లం­ఘి­స్తే రెం­డు­సా­ర్లు హె­చ్చ­రి­స్తా­రు. మూ­డో­సా­రి కూడా రి­పీ­ట్ చే­స్తే బ్యా­టిం­గ్ జట్టు­కు అద­నం­గా 5 పరు­గు­ల­ను కే­టా­యి­స్తా­రు. ఇక అదే సమ­యం­లో బౌ­లిం­గ్ జట్టు నుం­చి 5 పరు­గు­ల­ను కట్ చే­స్తా­రు. ప్ర­తీ 80 ఓవ­ర్ల­కు ఈ రూల్ రీ­స్టా­ర్ట్ అవు­తుం­ది. ఇన్నిం­గ్స్ ప్రా­రం­భం నుం­చి 50వ ఓవర్ దాకా రెం­డు బం­తు­లు వా­డు­తూ బౌ­లిం­గ్ చే­స్తు­న్నా­రు. అయి­తే ఇప్పు­డు ఈ ని­బం­ధన మా­ర­నుం­ది. ఇకపై ఈ రూల్ 35 ఓవ­ర్ల వరకే ఉం­టుం­ది. అంటే 34 ఓవ­ర్లు ము­గి­సే­దా­కా రెం­డు బం­తు­ల­ను వా­డు­కొ­ని బౌ­లిం­గ్ చే­య­వ­చ్చు. కానీ 35వ ఓవర్ తర్వాత 50వ ఓవర్ దాకా ఏదై­నా ఒకటే బం­తి­తో బౌ­లిం­గ్ చే­యా­ల్సి ఉం­టుం­ది. వర్షం వల్ల లేదా ఇతర కా­ర­ణాల వల్ల మ్యా­చ్ 35 ఓవ­ర్ల­కు కు­దిం­చి­తే ఒక్క బం­తి­తో­నే బౌ­లిం­గ్ చే­యా­ల్సి ఉం­టుం­ది.

డీఆర్ఎస్

ఇకపై కీ­ప­ర్ పట్టిన ఔట్ల వి­ష­యం­లో అల్ట్రా ఎడ్జ్‌­లో బంతి బ్యా­ట్‌­కు తా­కిం­దా? లేదా ప్యా­డ్‌­కు తా­కిం­దా? అనే­ది చూ­స్తా­రు. క్యా­చ్ ఔట్ కా­క­పో­తే ఎల్బీ­డ­బ్ల్యూ చెక్ చే­స్తా­రు. బాల్ ట్రా­కిం­గ్‌­లో ఔట్ అని తే­లి­తే మా­త్రం బ్యా­ట­ర్ పె­వి­లి­య­న్ దారి పట్టక తప్ప­దు. కం­క­ష­న్ ప్రో­టో­కా­ల్స్‌­లో రెం­డు మా­ర్పు­లు చే­సిం­ది ఐసీ­సీ. కం­క­ష­న్ రీ­ప్లే­స్‌­మెం­ట్ ఎవ­ర­నే­ది ముం­దే జట్లు చె­ప్పా­ల్సి ఉం­టుం­ది. మ్యా­చ్ సమ­యం­లో గా­య­ప­డి దూ­ర­మైన ఆట­గా­ళ్ల­ను 7 రో­జుల పాటు గమ­ని­స్తా­రు. కో­లు­కు­న్నా­ర­ని తే­లా­కే వా­రి­ని తి­రి­గి ఆడేం­దు­కు అను­మ­తి­స్తా­రు.

Tags

Next Story