IND vs AUS: పెర్త్ టెస్టులో కుప్పకూలిన భారత్

IND vs AUS: పెర్త్ టెస్టులో కుప్పకూలిన భారత్
X
మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 150కే ఆలౌట్.

బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత్ కుప్పకూలింది. కంగారుల బౌలింగ్ ధాటికి బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టడంతో తొలి ఇన్నింగ్స్ లో భారత్ కేవలం 150 పరుగులకే పరిమితమైంది. నితీశ్ కుమార్ రెడ్డి(41), రిషబ్ పంత్ (37), కేఎల్ రాహుల్(26) పరుగులు మినహా మిగిలిన బ్యాటర్లందరూ చేతులెత్తేశారు. ఏడుగురు బ్యాటర్లు కనీసం రెండెంకల స్కోరు కూడా చేయలేదు. ఇన్నింగ్స్ లో నితీష్ రెడ్డి 41 పరుగులతో జట్టు టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆస్ట్రేలియా తరపున జోష్ హేజిల్‌వుడ్ 4 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ మొదలైనప్పటి నుండి ఆస్ట్రేలియా జట్టు డామినేషన్ క్లియర్ గా కనపడింది. భారత ఇన్నింగ్స్ ఆడడానికి వచ్చిన యశస్వి జైస్వాల్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. దీని తర్వాత, దేవదత్ పడిక్కల్ కూడా నంబర్-3లో తన ఖాతాను కూడా తెరవలేకపోయాడు. దింతో ఇద్దరు డక్ అవుట్ గా వెనుదిరిగారు.

కోహ్లీ కూడా అలా వచ్చి ఇలా..

జోష్ హేజిల్‌వుడ్ వ్యక్తిగత స్కోరు 5 వద్ద విరాట్ కోహ్లీని అవుట్ చేయడం ద్వారా భారత్‌కు మూడో దెబ్బ పడింది. లంచ్ ప్రకటనకు ముందు కేఎల్ రాహుల్ 26 పరుగుల వద్ద స్టార్క్ బౌలింగ్‌లో వివాదాస్పదంగా ఔటయ్యాడు. లంచ్ విరామం తర్వాత మిచెల్ మార్ష్ ధృవ్ జురెల్ (11), వాషింగ్టన్ సుందర్ (4)లను తన ఖాతాలో వేసుకున్నాడు. 37 పరుగులు చేసి మంచి టచ్ లో ఉన్న పంత్ పాట్ కమిన్స్ విలువైన వికెట్ తీశాడు. దీని తర్వాత, హర్షిత్ రాణా 7 పరుగుల వద్ద అవుట్ కాగా.. కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా 8 పరుగుల వద్ద ఔటయ్యాడు. భారత్‌కు చివరి వికెట్ నితీష్ రాణా రూపంలో పడింది. జోష్ హేజిల్‌వుడ్‌ 4 వికెట్స్ తీయగా.. పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, మిచెల్ మార్ష్ లు చెరో 2 వికెట్లు తీశారు.

థర్డ్ అంపైర్ తప్పిదంతో కేఎల్ రాహుల్ అవుట్.. ?

హైదరాబాద్​లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌కి రామోజీ ఫౌండేషన్‌ భారీ విరాళం ప్రకటించింది. రామోజీ ఫౌండేషన్‌ ట్రస్టీ సీహెచ్‌ కిరణ్‌ రూ.30 కోట్ల విరాళం అందజేశారు. ఐఎస్‌బీలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కార్పొరేట్ సామాజిక బాధ్యతగా ఆ నిధులను అందించింది. ఐఎస్‌బీకి కొత్తగా అందుబాటులోకి రానున్న ఎగ్జిక్యూటివ్ సెంటర్​లో 430 సీట్ల సామర్థ్యంతో నిర్మించే అత్యాధునిక ఆడిటోరియం కోసం ఆ నిధులు ఖర్చు చేయనున్నారు. ఈ ఆడిటోరియం అందుబాటులోకి వస్తే ప్రాంగణంలో అంతర్జాతీయ సదస్సులు, పరిశోధనాత్మక సెమినార్లు, ప్రముఖుల ప్రసంగాలు, ఇతర ముఖ్య కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంది.

Tags

Next Story