IND vs AUS: మూడో టీ20లో గెలిస్తే..

ఆస్ట్రేలియాతో జరుగుతున్న అయిదు టీ 20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లను సొంతం చేసుకున్న టీమిండియా... సిరీస్‌పై కన్నేసింది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ విజయం సాధించి మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే గెలవాలని పట్టుదలగా ఉంది. తొలి మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో నెగ్గిన భారత్.. రెండో టీ20లో 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక గువాహటిలో జరిగే నేటి మ్యాచ్‌లో భారత్ ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. అయితే ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత జట్టు రికార్డు నెలకొల్పనుంది. టీ20 క్రికెట్ అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించనుంది. టీ20 ఫార్మాట్‌లో ఇప్పటివరకు 211 మ్యాచ్‌లాడిన టీమిండియా 135 విజయాలు సాధించింది. అదే సమయంలో పాకిస్థాన్ కూడా 226 మ్యాచ్‌ల్లో 135 మ్యాచ్‌లు గెలిచింది. ప్రస్తుతం పొట్టి ఫార్మాట్‌లోఅత్యధిక మ్యాచ్‌లు గెలిచిన జట్ల జాబితాలో భారత్, పాకిస్థాన్ మొదటి స్థానంలో ఉన్నాయి. టీమిండియా మరొక మ్యాచ్ గెలిస్తే పాకిస్థాన్ రికార్డును అధిగమించి అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా చరిత్ర సృష్టించనుంది. దీంతో మంగళవారం జరిగే మ్యాచ్‌లో గెలిచి టీమిండియా ఈ రికార్డు అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలనే పట్టుదలతో ఉంది. గత మ్యాచ్‌లో చెలరేగి ఆడిన స్టాయినిస్, టిమ్ డేవిడ్ ఫామ్‌లో ఉండడం ఆ జట్టును కొంచెం ప్రశాంతంగా ఉంచేలా చేస్తోంది. మ్యాక్స్‌వెల్ మరోసారి విధ్వంసకరంగా ఆడాలని ఆసిస్ కోరుకుంటోంది. ఓపెనర్లు స్టీవ్ స్మిత్, మాథ్యూ షార్ట్‌ల నుంచి జట్టు శుభారంభం ఆశిస్తోంది. ఆ జట్టు బౌలర్ల ప్రదర్శన మెరుగుపడాల్సి ఉంది. రెండో టీ20లో ధారాళంగా పరుగులిచ్చిన పేసర్ అబాట్ స్థానంలో బెరెన్‌డార్ఫ్ ఆసీస్ తుది జట్టులోకి రావచ్చు. ఆస్ట్రేలియా జట్టులో స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా వంటి వారి సీనియర్ ఆటగాళ్లు తొమ్మిది వారాల పాటు భారత్‌లో ఉన్నారు. వారిలో అలసట కనిపిస్తోంది. ఆ ప్రభావం బ్యాటింగ్‌పై కనిపిస్తోందని క్రీజా నిపుణులు చెబుతున్నారు.
భారత్: యశస్వీ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ముకేశ్ కుమార్.
ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్, షార్ట్, ఇన్‌గ్లి్‌స, గ్లెన్ మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, టిమ్ డేవిడ్, వేడ్ (కెప్టెన్), జంపా, ఎల్లిస్, బెహ్రెన్‌డార్ఫ్, తన్వీర్ సంఘా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com