BGT: గ‌బ్బాలో వ‌ర్షం.. రెండో సెష‌న్ పూర్తిగా ర‌ద్దు

BGT: గ‌బ్బాలో వ‌ర్షం.. రెండో సెష‌న్ పూర్తిగా ర‌ద్దు
X
మరో మూడు రోజులు వర్షాలు తప్పవన్న వాతావరణ శాఖ.... మ్యాచ్ ఫలితం రావడం కష్టమే..!

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ లో జరుగుతున్న మూడో టెస్టుకు వరుణుడు అడ్డుపడ్డాడు. బ్రిస్బేన్‌లో భారీ వ‌ర్షం కురుస్తోంది. దీంతో మూడో టెస్టుకు అంత‌రాయం ఏర్ప‌డింది. టీ బ్రేక్ త‌ర్వాత కూడా జ‌ల్లులు కురుస్తున్నాయి. గ‌బ్బా పిచ్‌పై క‌వ‌ర్స్ అలాగే ఉంచారు. రెండో సెష‌న్‌లో పూర్తిగా ఆట సాగ‌లేదు. తొలుత టాస్ గెలిచిన ఇండియా ఫ‌స్ట్ బౌలింగ్ ఎంచుకుంది. 13.2 ఓవ‌ర్లు బౌల్ చేయ‌గానే వ‌ర్షం స్టార్ట్ అయ్యింది. అప్ప‌టికి ఆస్ట్రేలియా వికెట్ న‌ష్టపోకుండా 28 ర‌న్స్ చేసింది. 13.2 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు 28/0 వద్ద ఉన్నప్పుడు వరుణుడు రెండోసారి ఎంట్రీ ఇచ్చాడు. ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో లంచ్ బ్రేక్ ఇచ్చారు అంపైర్లు. కానీ రెండో సెషన్ నాటికి కూడా వర్షం తగ్గలేదు. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లూ.. డ్రెస్సింగ్ రూమ్‌లకే పరిమితమయ్యారు. మ్యాచ్ వేదిక అయిన బ్రిస్బేన్‌లో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. దీంతో రెండో సెషన్ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఖ‌వాజా 19, మెక్‌స్వీనే 4 ర‌న్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. భార‌త్ త‌ర‌పున ముగ్గురు పేస‌ర్లు బ‌రిలోకి దిగారు. బుమ్రా, సిరాజ‌, ఆకాశ్ దీప్ బౌలింగ్ చేశారు. అయిదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇరు జ‌ట్లు 1-1 తేడాతో స‌మంగా ఉన్నాయి.

మరో మూడు రోజులు వర్షాలు

శనివారం మొత్తం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షం పడేందుకు 88% అవకాశం ఉందని.. అంచనా వేస్తోంది. దీంతో మూడో టెస్టు తొలి రోజ మళ్లీ ప్రారంభం అవుతుందా.. లేదా అన్నది అనుమానంగా మారింది. ఇక ఈ మ్యాచ్ జరిగే మరో నాలుగు రోజులు కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఫలితం వస్తుందా లేదా అన్నది అనుమానంగా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో భారత్.. రెండు మార్పులతో బరిలోకి దిగింది. రవిచంద్రన్ అశ్విన్, హర్షిత్ రాణా స్థానాల్లో రవీంద్ర జడేజా, ఆకాశ్ దీప్‌లకు అవకాశం కల్పించింది.

గబ్బా టెస్టుకు భారత తుది జట్లు:

భారత్: యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ (కెప్టెన్), రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్

Tags

Next Story