IND vs AUS: నేడే తొలి వన్డే.. పొంచి ఉన్న వర్షం ముప్పు

ఆస్ట్రేలియా, టీమ్ఇండియా పెర్త్ వేదికగా నేడు మొదటి వన్డే మ్యాచ్‌లో తలపడనున్నాయి. దాదాపు ఏడు నెలల విరామం తర్వాత టీమ్ఇండియా దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పునరాగమనం చేయబోతున్నారు. ఈ అద్భుత క్షణం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఫ్యాన్స్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లే అవకాశముంది. వర్షం వల్ల మ్యాచ్ మొత్తంగా రద్దయ్యే ప్రమాదం లేకపోయినప్పటికీ.. కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా వాతావరణ శాఖ నివేదిక ప్రకారం 63 శాతం వర్షం కురిసే అవకాశమున్నట్లు సమాచారం. స్థానిక సమయం ప్రకారం ఉదయం 11:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. అదే సమయంలో జల్లులు పడే అవకాశముంది. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ఆరంభమయ్యే ఛాన్స్ ఉంది. అయితే క్రికెట్ అభిమానులకు శుభవార్త ఏంటంటే.. ఇక ఆ తర్వాత ఏ మాత్రం వాన పడదట. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ వన్డేల్లో ఆడనుండటంతో, ఈ సిరీస్‌పై ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఆస్ట్రేలియాలో అభిమానుల్లో అపారమైన ఉత్సాహం నెలకొంది. వీరిద్దరూ ఆస్ట్రేలియా గడ్డపై తమ ప్రతిభను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. మిచెల్ మార్ష్ మాట్లాడుతూ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను “లెజెండ్స్ ఆఫ్ ది గేమ్” అని ప్రశంసించారు. ముఖ్యంగా, వైట్-బాల్ ఫార్మాట్లో విరాట్ కోహ్లీని “గ్రేటెస్ట్ ఛేజర్ ఎవర్” అని అభివర్ణించారు. ఆస్ట్రేలియాలో ఈ ఇద్దరు దిగ్గజాలు ఆడటం వల్ల మ్యాచ్‌లకు భారీ డిమాండ్ ఏర్పడిందని మార్ష్ ప్రత్యేకంగా పేర్కొన్నారు. మిచెల్ మార్ష్ మాట్లాడుతూ.. “నేను వారిద్దరితో చాలా సార్లు ఆడటం ఒక గొప్ప అనుభవం.
వారు చరిత్రలో గొప్ప ఆటగాళ్ళు. ముఖ్యంగా విరాట్, వైట్-బాల్ ఫార్మాట్లో అత్యుత్తమ ఛేజర్. టికెట్ల అమ్మకాలు ఎందుకు అంత ఎక్కువగా ఉన్నాయో, ఇంతమంది ప్రజలు వారిని చూడటానికి ఎందుకు వస్తున్నారో మీరు గమనించవచ్చు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ వన్డేల్లో ఆడనుండటంతో, ఈ సిరీస్‌పై ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఆస్ట్రేలియాలో అభిమానుల్లో అపారమైన ఉత్సాహం నెలకొంది. వీరిద్దరూ ఆస్ట్రేలియా గడ్డపై తమ ప్రతిభను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓపెనర్లుగా కెప్టెన్ గిల్ తో పాటు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ను ఆరంభించనున్నారు. టాలెంటెన్డ్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ బెంచ్ కే పరిమితం కానున్నాడు. మూడో స్థానంలో కోహ్లీ స్థానానికి తిరుగులేదు. నాలుగో స్థానంలో వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బరిలోకి దిగుతాడ
భారత వన్డే జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సిరాజ్, అర్ష్‌దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్.
ఆస్ట్రేలియా స్క్వాడ్:
మ్యాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, మ్యాట్ రెన్‌షా, లబుషేన్, మిచెల్ ఓవెన్, కూపర్ కానెల్లీ, మిచెల్ మార్ష్, జోష్ పిలిఫ్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, నాథన్ ఎల్లిస్, బెన్ డార్విషూస్, జేవియర్ బార్ట్ లెట్, మాథ్యూ కునెమన్
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com