IND vs ENG: రసవత్తర ముగింపు ముంగిట అయిదో టెస్ట్

IND vs ENG: రసవత్తర ముగింపు ముంగిట అయిదో టెస్ట్
X
విజయానికి 3 వికెట్ల దూరంలో టీమిండియా 35 పరుగుల దూరంలో ఇంగాండ్ సెంచరీలతో చెలరేగిన బ్రూక్, రూట్ వర్షం కారణంగా ముందుగానే నిలిచిన ఆట

ఇంగ్లాండ్, భారత్ మధ్య టెస్టు సిరీస్ రసవత్తర ముగింపు ముంగిట నిలిచింది. సిరీస్ ఫలితం ఐదో రోజైన సోమవా- రం తేలనుంది. 374 పరుగుల లక్ష్యఛేదనలో 50/1తో నాలుగో రోజు ఆటను మొదలుపెట్టిన ఇంగ్లాండ్.. ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ విజయానికి ఇంకా 35 పరుగులు అవ- సరం. జేమీ ఒవర్టన్ (0*), జేమీ స్మిత్ (2*) క్రీజులో ఉన్నారు. వర్షం కారణంగా ఆటను ముందుగానే నిలిపివే శారు. హ్యారీ బ్రూక్ (111; 98 బంతుల్లో 14 ఫోర్లు, 2 సి- క్స్లు), జో రూట్ (105; 152 బంతుల్లో 12 ఫోర్లు) శత- కాలు బాదారు. బెన్ డకెట్ (54; 83 బంతుల్లో 5 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. ఓలీ పోప్ (27; 34 బంతుల్లో 5 ఫోర్లు), జాక్ క్రాలీ (14; 36 బంతుల్లో) పరుగులు చేశా- రు. భారత బౌలర్లలో ప్రసిద్ధ కృష్ణ 3, మహ్మద్ సిరాజ్ 2, ఆకాశ్ దీప్ ఒక వికెట్ పడగొట్టారు.

బ్రూక్ విధ్వంసం

హ్యారీ బ్రూక్ (98 బంతుల్లో 111; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర శతకం బాది ఇంగ్లండ్ గెలుపుకు గట్టి పునాది. వేశాడు. అనంతరం రూట్ మరో శతకంతో ఇంగ్లాండ్ జట్టు- ను విజయం ముంగిట నిలిపాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో క్రాలే (14), డకెట్ (54), ఓలీ పోప్ (27), బ్రూక్ (111) ఔటయ్యారు. రెండో ఇన్నింగ్స్లో 50/1తో నాలుగో రోజు ఆటను మొదలుపెట్టిన ఇంగ్లాండ్.. తొలి సెషన్లో 114 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. ఓవర్ నైట్ స్కోరు 34తో క్రీజులోకి వచ్చిన బెన్ డకెట్ (54; 83 బంతుల్లో 6 ఫోర్లు) అర్ధ శతకం చేసి ప్రసిద్ధి బౌలింగ్ స్లిప్లో రాహు- లక్కు చిక్కాడు. తర్వాత వచ్చిన ఓలీ పోప్ (27; 34 బం- తుల్లో 5 ఫోర్లు)ను సిరాజ్ ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపా- డు. ఈ క్రమంలో రూట్, బ్రూక్ దూకుడుగా ఆడారు.

చరిత్ర సృష్టించిన జో రూట్

ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ సరికొత్త చరిత్ర సృష్టించా- డు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ చరిత్రలో 6000 పరుగులు 69 మ్యాచ్ పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా ప్రపంచ 8- కార్డు నెలకొల్పాడు. భారత్తో జరుగుతున్న ఐదో టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో రూట్ ఈ ఘనత సాధించాడు. టీమిండియా నిర్దే- శించిన 374 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తుండగా.. 25 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రూట్ డబ్ల్యూటీసీలో 6000 పరుగుల మైలురాయిని తాకాడు. డబ్ల్యూటీసీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టీవ్ స్మిత్ (4278), మారస్ లబూషేన్ (4225), బెన్ స్టోక్స్ (3616), ట్రావిస్ హె- డ్ (3300) రూట్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. రూట్ డబ్ల్యూ- టీసీలో 20 సెంచరీలు, 22 అర్థ సెంచరీలు చేయడం విశేషం.

Tags

Next Story