jadeja: తొలి ఆసియా ఆటగాడిగా జడేజా చరిత్ర

jadeja: తొలి ఆసియా ఆటగాడిగా జడేజా చరిత్ర
X
చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా

భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో తన అద్భుత ప్రద- జట్టుకు ఎన్నో విజయాలు అందించారు. తా- జాగా ఇంగ్లాండ్ జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగం'గా, 'సర్' జడేజా మరో అరుదైన మైలురాయిని అధిగమించారు. ఇంగ్లాండ్ గడ్డపై 1000 టెస్ట్ పరుగులు పూర్తి చేయడమే కాకుండా, 30కి పైగా వికెట్లు పడగొ- ట్టిన మొట్టమొదటి ఆసియా ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. ఈ అద్భుతమైన ఘనతను సాధించిన ప్రపంచంలోనే మూడో ఆల్ రౌండర్ జడేజా నిలిచా- రు. ఇంతకుముందు ఇంగ్లాండ్ దిగ్గజ ఆల్ రౌండర్ వి- ల్ఫ్రెడ్ రోడ్స్ (ఆస్ట్రేలియాలో 1032 పరుగులు, 42 వికెట్లు), వెస్టిండీస్ లెజెండ్ సర్ గ్యారీ సోబర్స్ (ఇం- గ్లాండ్లో 180 పరుగులు, 62 వికెట్లు) మాత్రమే ఈ ఘనతను సాధించారు. ఈ జాబితాలో జడేజా చేరడం, అది కూడా ఆసియా ఖండం నుంచి తొలి ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్ గడ్డపై 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఏడో భారత బ్యాట ర్ గా రికా- ర్డుల్లోకెక్కాడు. తద్వారా బ్యాటింగ్ దిగ్గజాలైన సచిన్ టెండూల్క- ర్, విరాట్ కోహ్లి సరసన చేరాడు.

ఇంగ్లాండ్లో స్పిన్సర్లకు అంతగా అనుకూలించ- ని పిచ్ పై ఒక ఆల్ రౌండర్ గా ఇలాంటి ప్రదర్శన చే యడం జడేజా సామర్థ్యానికి నిదర్శనం. ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్లో జడేజా బ్యాటింగ్లో అద్భుతమైన ఫా మన్ను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అనేక అర్ధసెంచరీలు సాధించి, భారత బ్యాటింగ్కు వెన్నెముకగా నిలి- చారు. బౌలింగ్లో అంచనాలకు తగ్గట్టుగా వికెట్లు తీ- యకపోయినా, కీలక సమయాల్లో బ్యాటింగ్ ప్రదర్శనతో జట్టుకు అండగా నిలుస్తున్నారు.

Tags

Next Story