IND vs eng:భారత్‌ భారీ స్కోరు.. ధీటుగా స్పందిస్తున్న ఇంగ్లాండ్

IND vs eng:భారత్‌ భారీ స్కోరు.. ధీటుగా స్పందిస్తున్న ఇంగ్లాండ్
X
రిషభ్ పంత్ అద్భుత శతకం.. 471 పరుగుల భారత్ ఆలౌట్.. ఆట ముగిసే సరికి ఇంగ్లాండ్ 209/3

భా­ర­త్‌-ఇం­గ్లాం­డ్ మధ్య జరు­గు­తు­న్న తొలి టె­స్టు రస­కం­దా­యం­లో పడిం­ది. తొలి టె­స్టు­లో భా­ర­త్ భారీ స్కో­రు చే­య­గా... ఇం­గ్లాం­డ్‌ కూడా ధీ­టు­గా­నే స్పం­ది­స్తోం­ది. 359/3తో రెం­డో రోజు ఆటను ఆరం­భిం­చిన భా­ర­త్.. మరో 112 పరు­గు­లు జో­డిం­చి ఇన్నిం­గ్స్‌­ను ము­గిం­చిం­ది. తొలి టె­స్టు మొ­ద­టి ఇన్నిం­గ్స్‌­లో టీ­మ్ఇం­డి­యా 471 పరు­గు­ల­కు ఆలౌ­టైం­ది. ఒక దశలో సు­నా­య­సం­గా 500కు­పై­గా పరు­గు­లు చే­సే­లా కని­పిం­చిన టీ­మ్ఇం­డి­యా వరు­స­గా వి­కె­ట్లు చే­జా­ర్చు­కుం­ది. 41 పరు­గుల వ్య­వ­ధి­లో ఏడు వి­కె­ట్లు కో­ల్పో­యిం­ది. 127 పరు­గుల ఓవ­ర్‌­నై­ట్‌ స్కో­రు­తో బరి­లో­కి ది­గిన కె­ప్టె­న్ శు­భ్‌­మ­న్ గిల్ (147; 227 బం­తు­ల్లో) వద్ద ఔట­య్యా­డు. 65 పరు­గుల ఓవ­ర్‌ నైట్ స్కో­రు­తో బరి­లో­కి ది­గిన రి­ష­భ్‌ పంత్ (134; 178 బం­తు­ల్లో 12 ఫో­ర్లు, 6 సి­క్స్‌­లు) శత­కం­తో వి­రు­చు­కు­ప­డ్డా­డు.ఐపీ­ఎ­ల్‌­లో అద­ర­గొ­ట్టి చాలా కాలం తర్వాత జా­తీయ జట్టు­లో­కి వచ్చిన కరు­ణ్ నా­య­ర్ ని­రా­శ­ప­ర్చా­డు. నా­లు­గు బం­తు­లు ఎదు­ర్కొ­ని డకౌ­ట్‌­గా వె­ను­ది­రి­గా­డు. రవీం­ద్ర జడే­జా (11), శా­ర్దూ­ల్ ఠా­కూ­ర్ (1) ని­రా­శ­ప­ర్చా­రు. తొలి రోజే యశ­స్వి జై­స్వా­ల్ (101; 159 బం­తు­ల్లో 16 ఫో­ర్లు, 1 సి­క్స్‌) శతకం, కే­ఎ­ల్ రా­హు­ల్ (42) చే­సిన సం­గ­తి తె­లి­సిం­దే. ఇం­గ్లాం­డ్ బౌ­ల­ర్ల­లో బె­న్‌ స్టో­క్స్ 4, జోష్ టంగ్ 4, బ్రై­డ­న్ కా­ర్స్, షో­య­బ్ బషీ­ర్ చెరో వి­కె­ట్ పడ­గొ­ట్టా­రు. ఎన్నో అం­చ­నాల మధ్య బరి­లో­కి ది­గిన కరు­ణ్ నా­య­ర్.. దే­శ­వా­ళీ­ల్లో­లా­గే అం­త­ర్జా­తీయ మ్యా­చు­ల్లో­నూ ఇర­గ­దీ­స్తా­డ­ని అంతా అను­కు­న్నా­రు. పె­ద్ద­గా ఒత్తి­డి లేదు కా­బ­ట్టి వే­గం­గా పరు­గు­లు చే­స్తే బా­గుం­టుం­ద­ని భా­విం­చా­రు. కానీ నా­య­ర్ ఒక్క పరు­గు కూడా చే­య­కుం­డా­నే క్రీ­జు­ను వీ­డా­డు. ఎదు­ర్కొ­న్న ఐదో బం­తి­కే బెన్ స్టో­క్స్ బౌ­లిం­గ్‌­లో ఓలీ పో­ప్‌­కు క్యా­చ్ ఇచ్చి వె­ను­ది­రి­గా­డు.

పంత్ 7వ టెస్టు సెంచరీ.. ధోనీ రికార్డు బద్దలు

ఈ మ్యా­చ్‌­లో కీ­ప­ర్ రి­ష­బ్ పంత్ ఇం­గ్లాం­డ్ గడ్డ­పై మరో­సా­రి చె­ల­రే­గా­డు. తన ఇన్నిం­గ్స్‌­లో 178 బం­తు­ల్లో 134 రన్స్ చే­శా­డు. ఇం­గ్లాం­డ్‌­లో పం­త్‌­కు ఇది మూడో సెం­చ­రీ. ఇం­త­కు­ముం­దు 2018, 2021లో 100 పరు­గుల మా­ర్క్‌­ను అం­దు­కు­న్నా­డు. తాజా సెం­చ­రీ­తో పంత్ ది­గ్గజ క్రి­కె­ట­ర్ ఎం.ఎస్ ధోనీ రి­కా­ర్డు­ను బ్రే­క్ చే­శా­డు. పం­త్‌­కు ఇది 7వ టె­స్టు సెం­చ­రీ. టె­స్టు­ల్లో అత్య­ధిక శత­కా­లు నమో­దు చే­సిన భారత వి­కె­ట్ కీ­ప­ర్‌­గా రి­కా­ర్డు­కె­క్కా­డు. ఇం­త­కు­ముం­దు ఆరు సెం­చ­రీ­ల­తో ధో­నీ­తో కలి­సి సం­యు­క్తం­గా ఈ రి­కా­ర్డు­ను కలి­గి ఉన్నా­డు. తా­జా­గా ధో­నీ­ని వె­న­క్కి­నె­ట్టా­డు. మొ­త్తం­గా అత్య­ధిక సెం­చ­రీ­లు చే­సిన వి­కె­ట్ కీ­ప­ర్ల జా­బి­తా­లో పంత్ 8వ స్థా­నం­లో ఉన్నా­డు. ఆస్ట్రే­లి­యా మాజీ క్రి­కె­ట­ర్ ఆడమ్ గి­ల్‌­క్రి­స్ట్ 17 సెం­చ­రీ­ల­తో అగ్ర­స్థా­నం­లో కొ­న­సా­గు­తు­న్నా­డు. తొలి రోజు కూడా ధోనీ పే­రిట ఉన్న ఓ రి­కా­ర్డు­ను పంత్ బద్ద­లు­కొ­ట్టా­డు. సౌ­తా­ఫ్రి­కా, ఇం­గ్లాం­డ్, న్యూ­జి­లాం­డ్, ఆస్ట్రే­లి­యా దే­శా­ల్లో మో­స్ట్ సక్సె­స్‌­ఫు­ల్ భారత వి­కె­ట్ కీ­ప­ర్‌­గా పంత్ ఘనత సా­ధిం­చా­డు.

ధీటుగా స్పందిస్తున్న ఇంగ్లాండ్

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోరు చేయగా... బ్రిటీష్ జట్టు కూడా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. 125 బంతుల్లోనే శతకం చేసిన ఓలి పోప్ ఇంగ్లాండ్‌ను పోటీలో నిలిపాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఇంకా 262 పరుగుల వెనుకంజలో ఉంది. బెన్ డకెట్ 94 బంతుల్లో 62 పరుగులు చేసి రాణించాడు. డకెట్‌ను బుమ్రా బౌల్డ్ చేశాడు. ఈ మ్యాచులో బుమ్రా 3 వికెట్లు తీయగా ఈ మూడు వికెట్లు బుమ్రాకే దక్కాయి. ఈ టెస్టులో మూడో రోజు ఆట చాలా కీలకంగా మారనుంది.

Tags

Next Story