IND vs ENG: 148 ఏళ్ల టెస్ట్ చరిత్రలో ఒకే ఒక్కడు

IND vs ENG: 148 ఏళ్ల టెస్ట్ చరిత్రలో ఒకే ఒక్కడు
X
టీమిండియా సారధి శుభ్‌మన్‌ గిల్ సరికొత్త చరిత్ర

టీ­మిం­డి­యా టె­స్టు కె­ప్టె­న్ శు­భ్‌­మ­‌­న్ గిల్ మరో రి­కా­ర్డు నమో­దు చే­శా­డు. సం­చ­ల­నా­న్ని అం­దు­కు­న్నా­డు. 148 ఏళ్ల టె­స్టు చరి­త్ర­లో మరే బ్యా­ట­ర్ కు దక్క­ని రి­కా­ర్డు­ను సొం­తం చే­సు­కు­న్నా­డు. హి­స్ట­రీ క్రి­యే­ట్ చే­శా­డు. ఒకే టె­స్టు­లో 250, 150కు పైగా పరు­గు­లు చే­సిన ఏకైక బ్యా­ట­ర్ గా శు­భ్‌­మ­‌­న్ గిల్ ని­లి­చా­డు. ఇం­గ్లాం­డ్ తో రెం­డో టె­స్టు­లో తొలి ఇన్నిం­గ్స్ లో 269 పరు­గు­లు చే­సిన గిల్.. రెం­డో ఇన్నిం­గ్స్ లో 161 పరు­గు­లు సా­ధిం­చా­డు. 1971లో సు­నీ­ల్ గవా­స్క­ర్ నె­ల­కొ­ల్పిన రి­కా­ర్డు­ను 54 ఏళ్ల తర్వాత గిల్ బద్ద­లు కొ­ట్టా­డు. ఇం­గ్లాం­డ్‌­తో జరు­గు­తు­న్న రెం­డో టె­స్టు­లో ఈ ఘనత సా­ధిం­చా­డు. ఒకే టె­స్టు­లో అత్య­ధిక పరు­గు­లు చే­సిన భారత ఆట­గా­డి­గా ని­లి­చా­డు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో కదం తొక్కిన గిల్, రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ పూర్తి చేసుకుని జట్టును పటిష్ట స్థితిలో నిలబెట్టాడు. ఈ ఘనత సాధించిన భారత కెప్టెన్లలో సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీల తర్వాత మూడో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

గవాస్కర్ రికార్డు బద్దలు

గవా­స్క­ర్ రి­కా­ర్డు­ను అధి­గ­మిం­చి, ఇం­గ్లాం­డ్‌­లో డబు­ల్ సెం­చ­రీ చే­సిన ఏకైక కె­ప్టె­న్‌­గా రి­కా­ర్డు సృ­ష్టిం­చా­డు. ఇప్ప­టి­కే ఈ సి­రీ­స్‌­లో 500 పరు­గు­లు పూ­ర్తి చే­సిన గిల్.. మి­గ­తా మూడు టె­స్టు­ల్లో ఎలా రా­ణి­స్తా­డో చూ­డా­లి. టీ­మిం­డి­యా మాజీ లె­జెం­డ్ సు­నీ­ల్ గవా­స్క­ర్ 1971లో వె­స్టిం­డీ­స్‌­తో జరి­గిన టె­స్టు­లో 344 పరు­గు­లు చే­శా­డు. ఈ యాభై ఏళ్ల­లో ఈ రి­కా­ర్డు­ను బ్రే­క్ చే­సిన టీ­మిం­డి­యా ఆట­గా­డు లేనే లేడు. వీ­వీ­ఎ­స్ లక్ష్మ­ణ్ గవా­స్క­ర్ దగ్గ­ర­కు వచ్చిన 344 పరు­గు­ల­కు పైగా చే­య­లే­క­పో­యా­డు. 2001లో ఆస్ట్రే­లి­యా­తో జరి­గిన మ్యా­చ్‌­లో వీ­వీ­ఎ­స్ 340 పరు­గు­లు చే­శా­డు. టీ­మిం­డి­యా మాజీ సా­ర­థి సౌ­ర­వ్ గం­గూ­లీ 2007లో పా­కి­స్తా­న్‌­పై 330 పరు­గు­లు, వీ­రేం­ద్ర సె­హ్వా­గ్ 2008లో సౌ­తా­ఫ్రి­కా­పై 319 పరు­గు­లు చే­శా­డు. టీమిండియా తరఫున ఒక టెస్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున ఒకే టెస్టులో 350 పరుగులు చేసిన ఆటగాడు శుభమన్ గిల్ ఒక్కడే.

ఒకే ఒక్కడు

భారత టె­స్టు కె­ప్టె­న్ శు­భ్‌­మ­‌­న్ గిల్ రి­కా­ర్డు­లు బ్రే­క్ చే­స్తూ­నే ఉన్నా­డు. సరి­కొ­త్త చరి­త్ర­కు నాం­ది పలు­కు­తూ­నే ఉన్నా­డు. ఇం­గ్లాం­డ్ తో రెం­డో టె­స్టు­లో తొలి ఇన్నిం­గ్స్ లో డబు­ల్ సెం­చ­రీ, రెం­డో ఇన్నిం­గ్స్ లో హం­డ్రె­డ్ బా­దా­డు. ఓ టె­స్టు­లో 250 ప్ల­స్, 150 ప్ల­స్ స్కో­ర్లు చే­సిన ఫస్ట్ బ్యా­ట­ర్ గా ని­లి­చా­డు. అంతే కా­కుం­డా ఓ టె­స్టు­లో అత్య­ధిక పరు­గు­లు చే­సిన ఇం­డి­య­న్ ప్లే­య­ర్ గా హి­స్ట­రీ క్రి­యే­ట్ చే­శా­డు. ఈ మ్యా­చ్ లో గిల్ 430 రన్స్ చే­శా­డు. ఓవ­రా­ల్ గా చూ­సు­కుం­టే ఓ మ్యా­చ్ లో అత్య­ధిక పరు­గు­లు చే­సిన రెం­డో బ్యా­ట­ర్ గా ని­లి­చా­డు. గూచ్ (1990లో ఇం­డి­యా­పై 456) ఫస్ట్ ప్లే­స్ లో ఉన్నా­డు. ఇం­గ్లం­డ్ - ఇం­డి­యా ఐదు టె­స్టుల సి­రీ­స్‌­లో రెం­డో టె­స్టు­కే శు­భ­మ­న్ గిల్ 500కు పైగా పరు­గు­లు సా­ధిం­చా­డు. తొలి టె­స్టు­లో సెం­చ­రీ చే­సిన గిల్.. రెం­డో టె­స్టు మొ­ద­టి ఇన్నిం­గ్స్‌­లో 269 పరు­గు­లు, రెం­డో ఇన్నిం­గ్స్‌­లో సెం­చ­రీ చేసి రి­కా­ర్డు సృ­ష్టిం­చా­డు. టె­స్టు­ల్లో ఇం­గ్లం­డ్ గడ్డ­పై డబు­ల్ సెం­చ­రీ చే­సిన ఏకైక కె­ప్టె­న్‌­గా ఇప్ప­టి­కే రి­కా­ర్డు క్రి­యే­ట్ చే­సిన గిల్.. టీ­మిం­డి­యా బ్యా­ట­ర్ల­లో ఇం­గ్లం­డ్‌­పై ఎక్కువ పరు­గు­లు చే­సిన ఆట­గా­డి­గా­నూ ని­లి­చా­డు.

Tags

Next Story