IND vs PAK: పాక్ కూడా అదే కోరుకుంటుంది...

టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం భారత్, పాక్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. అనారోగ్యం కారణంగా జట్టుకు దూరమైనా అభిషేక్ శర్మ పూర్తిగా కోలుకుని మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని తెలిపారు. పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా మాట్లాడుతూ.. అభిషేక్ మంచి ప్లేయర్.. పూర్తిగా కోలుకుని ఆడితే బాగుంటుంది, మేం అత్యుత్తమ జట్టుతోనే ఆడాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు.
" టీమ్ఇండియాకు ఆ సత్తా ఉంది"
పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా.. ఆదివారం భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ పోరులో భారత్ విజయకేతనం ఎగురవేస్తుందని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్‌సింగ్ అన్నాడు. రాంచీలో అతడు విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘భారత్ మ్యాచ్‌ను కచ్చితంగా గెలుస్తుంది. పాకిస్థాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్‌ను భారత బ్యాటర్లు సమర్థంగా ఎదుర్కొంటారు. టీమ్ఇండియాకు ఆ సత్తా ఉంది. భారత్ చాలా మంచి జట్టు. నిత్యం ఆడుతున్నట్లే వారూ ఈ మ్యాచ్‌నూ ఆడతారు. ఒత్తిడి లేకుండా మెరుగైన ప్రదర్శన చేసి.. విజయ కేతనం ఎగుర వేస్తారు’ అని హర్భజన్ సింగ్ అన్నాడు. ప్రస్తుతం పాకిస్థాన్ మీదే తీవ్రమైన ఒత్తిడి ఉందని, ఈ మ్యాచ్ కచ్చితంగా భారత్ గెలుస్తుందని టీమ్ఇండియా మరో మాజీ క్రికెటర్ నయన్ మోంగియా అన్నాడు. ‘ఈ మ్యాచ్‌లో కచ్చితంగా భారత్ విజయం సాధిస్తుంది. భారత్ బ్యాటింగ్, బౌలింగ్ చూసి ఆ విషయం చెప్పొచ్చు. పాకిస్థాన్ ఐసీసీ ( టోర్నమెంట్లలో ఏడు లేదా ఎనిమిది మ్యాచుల్లో వరుసగా ఓడిపోయింది. నాకు తెలిసి భారత్‌కు మరోసారి పాక్‌ను ఓడించడం అంతకష్టం కాదు. పాకిస్థాన్ మీదే చాలా ఒత్తిడి ఉంది.
మ్యాచ్‌కు వర్షం గండం....?
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కు తీవ్ర అంతరాయం ఏర్పడే ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 15వ తేదీన కొలంబోలో వర్ష పాతం ఉండే ఛాన్సులు ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ 70 నుంచి 85% వరకు కొలంబోలో వర్ష పాతం ఉన్నట్లు స్పష్టమవుతోంది. అంటే కచ్చితంగా ఇండియాతో జరిగే పాక్ మ్యాచ్ సందర్భంగా వర్షం పడే ప్రమాదమే ఉంది. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ ఆగిపోతే చెరో పాయింట్ ఇస్తారు. లేదా రెండు జట్లు మ్యాచ్ ఆడాల్సిందే. అయితే ఈ మ్యాచ్ కు వర్షం విలన్ గా మారే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఎన్నో రోజులుగా వేచి చూస్తున్న ఈ ఫైట్ కు వర్షం అంతరాయం కలిగించకూడదని కోరుతున్నారు. అయితే, వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే, కోట్లల్లో నష్టం జరిగే ప్రమాదం ఉంది. టీ20 ప్రపంచ కప్ లో భాగంగా భారత్, పాకిస్తాన్ మ్యాచ్ నేడు జరగనుంది. ఈ నేపథ్యంలో కొలంబోకు చేరుకుంది భారత జట్టు. మొన్న నమీబియాతో ఢిల్లీ వేదికగా మ్యాచ్ ఆడింది భారత్. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన భారత్, ఆదివారం మరో భయంకరమైన ఫైట్ కోసం సిద్ధమైంది. క టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఆడనున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
