IND vs SA: అదరగొట్టిన బౌలర్లు..బెదరగొట్టిన అభిషేక్

IND vs SA: అదరగొట్టిన బౌలర్లు..బెదరగొట్టిన అభిషేక్
X
మూడో టీ 20లో టీమిండియా విజయం... 117 పరుగులకే కుప్పకూలిన సఫారీలు... సమష్టిగా రాణించిన భారత బౌలర్లు.. అభిషేక్ శర్మ ధనాధన్ ఇన్నింగ్స్

సౌ­తా­ఫ్రి­కా­తో ఐదు టీ20ల సి­రీ­స్‌­లో రెం­డో టీ20లో పరా­జ­యం పా­లైన భా­ర­త్ తి­రి­గి పుం­జు­కుం­ది. మూడో టీ20లో భారీ వి­జ­యా­న్ని నమో­దు చే­సిం­ది. ధర్మ­శా­ల­లో జరి­గిన మ్యా­చ్‌­లో టీ­మిం­డి­యా 7 వి­కె­ట్ల తే­డా­తో సౌ­తా­ఫ్రి­కా­ను మట్టి­క­రి­పిం­చిం­ది. ఈ మ్యా­చ్‌­లో భా­ర­త్ ఆల్‌­రౌం­డ్ ప్ర­ద­ర్శన చే­సిం­ది. ముం­దు­గా బ్యా­టిం­గ్ చే­సిన సౌ­తా­ఫ్రి­కా­ను 117 పరు­గు­ల­కే ఆలౌ­ట్ చే­సిం­ది. ఆ జట్టు­లో మా­ర్‌­క్ర­మ్(61) తర్వాత ఎవరూ రా­ణిం­చ­లే­దు. భారత బౌ­ల­ర్ల ధా­టి­కి డి­కా­క్(1), హెం­డ్రి­క్స్(0), బ్రె­వి­స్(2), స్ట­బ్స్(9), కా­ర్బి­నో బోష్(4), జా­న్సె­న్(2) తే­లి­పో­యా­రు. భారత బౌ­ల­ర్లు అర్ష్‌­దీ­ప్ సిం­గ్, వరు­ణ్ చక్ర­వ­ర్తి, హర్షి­త్ రాణా, కు­ల్దీ­ప్ యా­ద­వ్ చెరో 2 వి­కె­ట్ల సత్తా­చా­టి సఫా­రీల పత­నా­న్ని శా­సిం­చా­రు. అనం­త­రం 118 పరు­గుల లక్ష్యా­న్ని భారత జట్టు 15.5 ఓవ­ర్ల­లో ఛే­దిం­చిం­ది. 3 వి­కె­ట్లు కో­ల్పో­యి 120 రన్స్ చే­సిం­ది. అభి­షే­క్(35) ధనా­ధ­న్ ఇన్నిం­గ్స్‌­తో జట్టు­కు అది­రి­పో­యే ఆరం­భం అం­దిం­చ­గా.. గిల్(28), తి­ల­క్(25 నా­టౌ­ట్) వి­లు­వైన రన్స్ జో­డిం­చా­రు. ఈ వి­జ­యం­తో భారత జట్టు సి­రీ­స్‌­లో 2-1తో ఆధి­క్యం­లో­కి వె­ళ్లిం­ది.


దక్షి­ణా­ఫ్రి­కా­తో మూడో టీ20లో భారత పే­స­ర్లు అద­ర­గొ­ట్టా­రు. గత మ్యా­చ్‌­లో ధా­రా­ళం­గా పరు­గు­లు సమ­ర్పిం­చు­కు­న్న మన పే­స­ర్లు తమ­దైన పే­స్‌­తో ని­ప్పు­లు చె­రి­గా­రు. పి­చ్‌ పరి­స్థి­తు­ల­ను అను­కూ­లం­గా మలు­చు­కుం­టూ మొ­ద­ట్లో­నే సఫా­రీ­ల­ను కో­లు­కో­లే­ని దె­బ్బ­కొ­ట్టా­రు. ఇన్నిం­గ్స్‌ తొలి ఓవ­ర్‌ నా­లు­గో బం­తి­కే ఓపె­న­ర్‌ రెజా హెం­డ్రి­క్స్‌(0)ను అర్ష్‌­దీ­ప్‌­సిం­గ్‌ వి­కె­ట్ల ముం­దు దొ­ర­క­బు­చ్చు­కు­న్నా­డు. స్విం­గ్‌­ను సరి­గ్గా అర్థం చే­సు­కో­ని హెం­డ్రి­క్స్‌ తొలి వి­కె­ట్‌­గా వె­ను­ది­రి­గా­డు. హర్షి­త్‌ రానా రెం­డో ఓవ­ర్‌­లో ఈసా­రి డి­కా­క్‌(1) ఎల్బీ­డ­బ్ల్యూ అయ్యా­డు. దీం­తో దక్షి­ణా­ఫ్రి­కా 1 పరు­గు­కే ఓపె­న­ర్ల వి­కె­ట్లు కో­ల్పో­యిం­ది. ఇదే జో­రు­లో రానా బౌ­లిం­గ్‌­లో బం­తి­ని వి­కె­ట్ల మీ­ద­కు ఆడు­కు­న్న డె­వా­ల్డ్‌ బ్రె­వి­స్‌(2) మూడో వి­కె­ట్‌­గా వె­ను­ది­రు­గ­డం­తో స్కో­రు 7 పరు­గు­ల­కు 3 కీలక వి­కె­ట్లు కో­ల్పో­యిం­ది.

స్వ­ల్ప లక్ష్య­ఛే­ద­న­లో భా­ర­త్‌­కు మె­రు­గైన శు­భా­రం­భం దక్కిం­ది. ఓపె­న­ర్లు అభి­షే­క్‌­శ­ర్మ, శు­భ్‌­మ­న్‌ గి­ల్‌ దూ­కు­డు కన­బ­రి­చా­రు. తాను ఎదు­ర్కొ­న్న మొ­ద­టి బం­తి­నే సి­క్స్‌ బా­దిన అభి­షే­క్‌ ఉద్దే­శ­మేం­టో చె­ప్ప­క­నే చె­ప్ప­గా, గి­ల్‌ ఆది­లో­నే ఎల్బీ­డ­బ్ల్యూ ఔట్‌ నుం­చి బయ­ట­ప­డ్డా­డు. యా­న్సె­న్‌ బౌ­లిం­గ్‌­లో డీ­ఆ­ర్‌­ఎ­స్‌ ద్వా­రా లై­ఫ్‌ దక్కిం­చు­కు­న్న గి­ల్‌..అభి­షే­క్‌­కు జత­క­లి­శా­డు. వీ­రి­ద్ద­రు సఫా­రీ బౌ­ల­ర్ల­ను ఆత్మ­వి­శ్వా­సం­తో ఎదు­ర్కొం­టూ బౌం­డ­రీ­లు బా­ద­డం­తో రెం­డు ఓవ­ర్ల­లో­నే టీ­మ్‌­ఇం­డి­యా స్కో­రు 32కు చే­రు­కుం­ది. అయి­తే ఇన్నిం­గ్స్‌ జో­రం­దు­కుం­టు­న్న తరు­ణం­లో బా­చ్‌ బౌ­లిం­గ్‌­లో మా­ర్క్మ్‌ సూ­ప­ర్‌ క్యా­చ్‌­తో అభి­షే­క్‌ తొలి వి­కె­ట్‌­గా వె­ను­ది­రి­గా­డు.

Tags

Next Story