IND vs SA: స్పిన్‌ ఉచ్చులో చిక్కి.. చిత్తుగా ఓడి..

IND vs SA: స్పిన్‌ ఉచ్చులో చిక్కి.. చిత్తుగా ఓడి..
X
తొలి టెస్టులో సౌతాఫ్రికా ఘన విజయం... 124 పరుగులు ఛేదించలేకపోయిన భారత్... 93 పరుగులకే కుప్పకూలిన టీమిండియా

భా­ర­త్, సౌ­తా­ఫ్రి­కా జట్ల మధ్య ఈడె­న్ గా­ర్డె­న్స్ వే­ది­క­గా జరి­గిన మొ­ద­టి టె­స్టు­లో భారత జట్టు చి­త్తు­గా ఓడి­పో­యిం­ది. కే­వ­లం 124 పరు­గుల లక్ష్యా­న్ని చే­దిం­చక ముం­దు ఆలౌ­ట్ అయిం­ది. ఈ మ్యా­చు­లో టాస్ గె­లి­చిన సౌ­తా­ఫ్రి­కా జట్టు మొదట బ్యా­టిం­గ్ చే­సిం­ది. RSA మొ­ద­టి ఇన్నిం­గ్స్ లో 159, రెం­డో ఇన్నిం­గ్స్ లో 153 పరు­గు­ల­తో ఆలౌ­ట్ అయిం­ది. అయి­తే భారత జట్టు 124 పరు­గుల లక్ష్యం­తో చే­జిం­గ్ ది­గ­గా రెం­డో ఇన్నిం­గ్స్ లో కే­వ­లం 93 పరు­గు­ల­కు ఆలౌ­ట్ అయిం­ది. దీం­తో సౌ­తా­ఫ్రి­కా జట్టు 30 పరు­గుల తే­డా­తో వి­జ­యం సా­ధిం­చి టె­స్ట్ సి­రీ­స్ లో 1-0 ఆధి­క్యం­లో­కి చే­రిం­ది.

కష్టతరమైన పిచ్‌పై..

మొ­ద­టి టె­స్ట్ మ్యా­చ్‌­లో పర్యా­టక జట్టు దక్షి­ణా­ఫ్రి­కా 30 పరు­గుల తే­డా­తో భా­ర­త్ మీద వి­జ­యం సా­ధిం­చిం­ది. కే­వ­లం 124 పరు­గు­లు ఛే­దిం­చ­డం­లో భారత జట్టు వి­ఫ­ల­మైం­ది. పిచ్ బౌ­ల­ర్ల­కు అను­కూ­లిం­చిం­ది.ఆతి­థ్య భా­ర­త్ పరి­స్థి­తు­ల­ను బాగా ఉప­యో­గిం­చు­కు­న్నా, పర్యా­టక జట్టు సైతం అదే స్థా­యి­లో బౌ­లిం­గ్ తో రా­ణిం­చిం­ది. సై­మ­న్ హా­ర్మ­ర్ భారత జట్టు­ను దె­బ్బ­తీ­శా­డు. టీ­మిం­డి­యా నుం­చి వి­జ­యా­న్ని లా­గే­సు­కు­న్నా­డు. గత 15 ఏళ్ల­లో భారత గడ్డ­పై దక్షి­ణా­ఫ్రి­కా గె­లి­చిన తొలి టె­స్ట్ మ్యా­చ్ ఇదే. ఇది కే­వ­లం రెం­డు మ్యా­చ్‌ల టె­స్ట్ సి­రీ­స్ కాగా, రెం­డవ, చి­వ­రి మ్యా­చ్ నవం­బ­ర్ 22న గౌ­హ­తి­లో ప్రా­రం­భం కా­నుం­ది. భారత జట్టు తి­రి­గి పుం­జు­కు­ని సి­రీ­స్న్ సమం చే­యా­ల­ను­కుం­టుం­ది. ముం­దు­గా బ్యా­టిం­గ్ చే­సిన దక్షి­ణా­ఫ్రి­కా తొలి ఇన్నిం­గ్స్‌­లో 159 పరు­గు­లు చే­సిం­ది. భా­ర­త్ 30 పరు­గుల ఆధి­క్యా­న్ని సా­ధిం­చిం­ది, చి­వ­రి­కి 124 పరు­గుల లక్ష్యా­న్ని ని­ర్దే­శిం­చా­రు, భా­ర­త్ ఛే­దిం­చ­డం­లో వి­ఫ­ల­మైం­ది.

హార్మర్‌ పడగొట్టాడు..

లక్ష్యం చి­న్న­దే అయి­నా.. బంతి గి­ర్రున తి­రు­గు­తు­న్న పి­చ్‌­పై ఛేదన తే­లి­క­ని కూడా ఎవరూ అను­కో­లే­దు. కానీ టీ­మ్‌­ఇం­డి­యా తడ­బా­టు, పరా­భ­వం మా­త్రం ఊహిం­చ­ని­దే. అయి­తే స్పి­న్న­ర్లు భా­ర­త్‌ వె­న్ను­వి­రి­చి­నా.. మొ­ద­ట్లో దె­బ్బ­తీ­సిం­ది మా­త్రం పే­స­ర్‌ యా­న్స­నే. ఈడెన్‌లో పిచ్‌ మన స్పిన్నర్లు జడేజా, అక్షర్, కుల్‌దీప్‌లకు సహకరిస్తుందనుకుంటే.. దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ హార్మర్‌ హీరోగా నిలిచాడు. అతడు పడగొట్టిన 8 వికెట్లే మ్యాచ్‌ ఫలితాన్ని నిర్దేశించాయి. అతడే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’. సొంతగడ్డపై గత ఆరు టెస్టుల్లో భారత్‌కు ఇది నాలుగో పరాభవం. గత ఏడాది కివీస్‌ చేతిలో 0-3తో ఓడిన సంగతి తెలిసిందే. తాజా ఓటమితో టర్నింగ్‌ పిచ్‌లపై ఆడడంలో మన బ్యాటర్ల సమర్థతపై మరోసారి చర్చ మొదలైంది. భారత బ్యాటర్ల ప్రదర్శన అభిమానులకు పెద్ద షాకే. ఒక్క బ్యాటర్‌ కూడా సాధికారికంగా ఆడలేకపోయాడు. అదే సమయంలో ఆందోళన కలిగించే మరో విషయమేంటంటే.. ఈ నాలుగు ఓటముల్లోనూ ప్రత్యర్థి స్పిన్నర్లు భారత స్పిన్నర్ల కన్నా మెరుగైన ప్రదర్శన చేశారు.

Tags

Next Story