IND vs SA: ఎలాంటి ప్రయోగాలు లేవ్.. ఎర్రమట్టి పిచ్

IND vs SA: ఎలాంటి ప్రయోగాలు లేవ్.. ఎర్రమట్టి పిచ్
X
కోల్‌కతా దెబ్బకు మారిన టీమిండియా తీరు... రెండో టెస్టుకు సంప్రదాయ ఎర్రమట్టి పిచ్‌.. బౌన్స్‌తో పాటు స్పిన్‌కు అనుకూలంగా పిచ్

ఈడె­న్‌ గా­ర్డె­న్స్‌­లో స్పి­న్‌ ట్రా­క్‌­పై ఎదు­రైన పరా­భ­వం­తో భారత జట్టు రెం­డో టె­స్టు­పై ప్ర­త్యే­కం­గా దృ­ష్టి సా­రిం­చిం­ది. దక్షి­ణా­ఫ్రి­కా­తో ఈనెల 22 నుం­చి గు­వా­హ­టి­లో జరి­గే ఈ మ్యా­చ్‌ కోసం స్పి­న్‌­తో పాటు పే­స్‌­కు అను­కూ­లం­గా ఉం­డే­లా వి­కె­ట్‌­ను కో­రు­కుం­టోం­ది. అక్క­డి పి­చ్‌ కూడా ఎర్ర మట్టి­తో రూ­పొం­దిం­చ­నుం­డ­డం­తో పే­స­ర్ల­కు చక్క­టి బౌ­న్స్‌ లభిం­చే అవ­కా­శం ఉంది. బర్సా­పర స్టే­డి­యం­లో జరి­గే తొలి టె­స్టు ఇదే కా­వ­డం­తో వి­మ­ర్శ­ల­కు తా­వీ­య­కూ­డ­ద­నే ఆలో­చ­న­లో బీ­సీ­సీఐ ఉంది. అం­దు­కే బో­ర్డు హె­డ్‌ క్యు­రే­ట­ర్‌ ఆశి­ష్‌ భౌ­మి­క్‌ కూడా పి­చ్‌­ను పర్య­వే­క్షి­స్తు­న్నా­రు. ‘ఇక్క­డి పి­చ్‌­ను ఎర్ర­మ­ట్టి­తో తయా­రు­చే­శా­రు. దీం­తో ఇది ఎక్కువ పే­స్‌, బౌ­న్స్‌­ను అం­దిం­చే తత్వం కలి­గి ఉం­టుం­ది. హో­మ్‌ సీ­జ­న్‌­కు ముం­దే భా­ర­త్‌ తమ డి­మాం­డ్‌­ను స్ప­ష్టం­గా చె­ప్పిం­ది. అయి­తే అస్థిర బౌ­న్స్‌ మా­త్రం ఉం­డ­కూ­డ­ద­నే క్యు­రే­ట­ర్‌ ప్ర­య­త్ని­స్తు­న్నా­డు’ అని బీ­సీ­సీఐ వర్గా­లు పే­ర్కొ­న్నా­యి. తొలి టె­స్టు జరి­గిన కో­ల్‌­క­తా పి­చ్‌ మొ­ద­టి రోజే అద­న­పు బౌ­న్స్‌­తో పాటు స్పి­న్‌­కు అను­కూ­లం­గా మా­రిన వి­ష­యం తె­లి­సిం­దే. దీం­తో ఇరు జట్ల బ్యా­ట­ర్ల­కు పరు­గు­లు తీ­య­డం కష్టం­గా మా­రిం­ది.

బీసీసీఐ వాదన ఇదీ..

ఒక బీ­సీ­సీఐ వర్గం తె­లి­పిం­దే­మం­టే.. "ఈ పిచ్ రెడ్ సా­యి­ల్‌­తో తయా­రు అవు­తోం­ది. సహ­జం­గా­నే వీ­టి­లో స్పీ­డ్, బౌ­న్స్ ఎక్కు­వ­గా ఉం­టుం­ది. టీ­మిం­డి­యా హోం సీ­జ­న్ ప్రా­రం­భా­ని­కి ముం­దే తమ డి­మాం­డ్లు స్ప­ష్టం­గా చె­ప్పిం­ది. అం­దు­కే పిచ్ టర్న్ ఇస్తే, అది వే­గం­తో పాటు బౌ­న్స్‌­తో వస్తుం­ది. ఎక్కువ వే­రి­య­బు­ల్ బౌ­న్స్ ఉం­డ­కుం­డా క్యూ­రే­ట­ర్లు కృషి చే­స్తు­న్నా­రు." గు­వా­హ­టి పిచ్ కూడా కో­ల్‌­క­తా పి­చ్‌­లా­నే ఉం­టుం­దా అని గం­భీ­ర్‌­ను ప్ర­శ్నిం­చా­రు. దా­ని­కి ఆయన తాను తొలి రోజు నుం­చే టర్న్ ఇస్తు­న్న పిచ్ కా­వా­ల­ని ఎప్పు­డూ కో­ర­లే­ద­ని స్ప­ష్టం చే­శా­డు.

గంభీర్ కీలక వ్యాఖ్యలు

"టర్నిం­గ్ వి­కె­ట్ అయి­నా, తొలి రోజు నుం­చే ఎక్కువ టర్న్ ఉం­డ­కూ­డ­దు. టాస్ కీ­ల­క­మ­వ­కుం­డా ఉం­డా­లి. మే­మె­ప్పు­డూ చె­డ్డ పి­చ్‌­లు లేదా ర్యాం­క్ టర్న­ర్లు కా­వా­ల­ని అన­లే­దు. ఈ మ్యా­చ్ గె­లి­చి ఉండి ఉంటే, ఎవరూ పిచ్ గు­రిం­చి మా­ట్లా­డ­రు. మేము మా­న­సి­కం­గా, నై­పు­ణ్య పరం­గా మె­రు­గు­ప­డా­లి, పి­చ్‌­పై చర్చ­లు ఆపా­లి. ఎం­దు­కం­టే పిచ్ రెం­డు జట్ల­కూ ఒకటే. గు­వా­హ­టి ఏ పిచ్ ఇచ్చి­నా, ఆ పరి­స్థి­తు­ల్లో ఆడ­గ­లి­గే ఆట­గా­ళ్లు మన దగ్గర ఉన్నా­రు" అని గం­భీ­ర్ అన్నా­డు.

ప్రాక్టీస్‌ అలా..

ఈడె­న్‌­లో స్పి­న్న­ర్ల­ను దీ­టు­గా ఆడ­లేక వి­మ­ర్శల పా­లైన భారత బ్యా­ట­ర్లు నె­ట్‌ సె­ష­న్‌­లో ఆ ది­శ­గా దృ­ష్టి సా­రిం­చా­రు. ప్ర­స్తు­తం కో­ల్‌­క­తా­లో­నే ఉన్న ప్లే­య­ర్లు నె­ట్‌ ప్రా­క్టీ­స్‌ చే­శా­రు. ఇది ఆప్ష­న­ల్‌ కా­వ­డం­తో కొం­త­మం­దే బరి­లో­కి ది­గా­రు. ము­ఖ్యం­గా సాయి సు­ద­ర్శ­న్‌­తో పాటు ధ్రు­వ్‌ జు­రె­ల్‌ సిం­గి­ల్‌ ప్యా­డ్‌­ను ధరిం­చి ప్రా­క్టీ్‌­స­లో పా­ల్గొ­న్నా­రు. ఇది రి­స్క్‌­తో కూ­డు­కు­న్న­దై­న­ప్ప­టి­కీ ఎడ­మ­చే­తి బ్యా­ట­ర్‌ సు­ద­ర్శ­న్‌ సు­లు­వు­గా ఫ్రం­ట్‌ ఫు­ట్‌ షా­ట్‌ ఆడేం­దు­కు.. కుడి కాలి ప్యా­డ్‌­ను తొ­ల­గిం­చా­డు. ఈ సం­ద­ర్భం­లో డి­ఫె­న్స్‌ ఆడా­లం­టే కా­లు­ను కా­కుం­డా బ్యా­ట్‌­ను అడ్డు­గా పె­ట్టా­ల్సి ఉం­టుం­ది. జట్టు­లో­ని లె­ఫ్ట్‌ హ్యాం­డ­ర్లు స్పి­న్‌­ను ఎదు­ర్కొ­నే క్ర­మం­లో బ్యా­క్‌ ఫు­ట్‌ తీ­సు­కుం­టూ ఇబ్బం­ది పడు­తు­న్నా­రు. అం­దు­కే ముం­దు­కు వచ్చి ఆడే­లా సిం­గి­ల్‌ ప్యా­డ్‌­తో ప్రా­క్టీ­స్‌ చే­స్తు­న్నా­రు. జు­రె­ల్‌ రి­వ­ర్స్‌ స్వీ­ప్‌ షా­ట్లు ఎక్కు­వ­గా ఆడా­డు. రెండో టెస్టు గెలవాలని టీమిండియా గట్టి పట్టుదలగా ఉంది.

Tags

Next Story