IND vs WI: ద్వి శతకం దిశగా యశస్వీ జైస్వాల్

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్డేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ (173 నాటౌట్) భారీ సెంచరీతో కదం తొక్కగా.. యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్ (87) హాఫ్ సెంచరీ, కేఎల్ రాహుల్ (38) రాణించడంతో తొలి రోజు పూర్తిగా టీమిండియానే అధిపత్యం ప్రదర్శించింది. టీమిండియ బ్యాటర్ల దెబ్బకు వెస్టిండీస్ బౌలర్లు తేలిపోవడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 318 పరుగుల భారీ స్కోర్ చేసింది టీమిండియా. ప్రస్తుతం క్రీజులో యశస్వీ జైశ్వాల్ (173), కెప్టెన్ శుభమన్ గిల్ (20) ఉన్నారు.
"జై"స్వాల్ వన్‌మెన్ షో
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియాకు యువ ఓపెనర్ జైస్వాల్ అద్భుత ఆరంభాన్నిచ్చాడు. 145 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న అతడు.. ద్విశతకం (173*) దిశగా సాగుతున్నాడు. టెస్టు కెరీర్లో అతడికిది ఏడో శతకం. మూడో సెషన్లో అతడు 150+ స్కోరుకు చేరుకున్నాడు. తొలి రోజే ఇలా 150కిపైగా పరుగులు నమోదు చేయడం టెస్టుల్లో అతడికిది రెండోసారి. అతడి ఇన్నింగ్స్‌లో 22 ఫోర్లు ఉన్నాయి. ఇక తొలి టెస్టులో శతకం నమోదు చేసిన మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (38) వారికన్ బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. రాహుల్ నిష్ర్కమణతో క్రీజులోకి వచ్చిన సాయి సుదర్శన్ యశస్వీ జైశ్వాల్‌తో జతకట్టి స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత వచ్చిన సాయి సుదర్శన్ రాణించాడు. కొంత కాలంగా పేలవ ప్రదర్శనతో ఇబ్బందులు పడుతున్న సుదర్శన్ (87) ఈసారి పరుగుల బాట పట్టాడు. శతకానికి చేరువలో అతడు.. వారికన్ బౌలింగ్‌లోనే ఎల్బీగా ఔటయ్యాడు. అయితే.. అతడికిది ఊరటనిచ్చే ఇన్నింగ్సే. ప్రస్తుతం క్రీజులో జైస్వాల్(173*), గిల్ (20*) ఉన్నారు. గిల్ కూడా రాణిస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియాకు భారీ స్కోరు ఖాయమే.
సాయి సుదర్శన్ ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ గిల్, సెంచరీతో ఊపుమీదున్న జైశ్వాల్ మరో వికెట్ పడకుండా తొలిరోజును ముగించారు. వెస్టిండిస్ బౌలర్లలో జోమెల్ వారికన్కే రెండు వికెట్లు దక్కాయి. దీంతో తొ లి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 318 పరుగుల భారీ స్కోర్ చేసింది టీమిండియా. ప్రస్తుతం క్రీజులో యశస్వీ జైశ్వాల్ (173), గిల్ (20) ఉన్నారు. చేతిలో మరో 8 వికెట్లు ఉండటంతో ఫస్ట్ ఇన్సింగ్స్‌లో టీమిండియా భారీ స్కోర్ చేసేలా కనిపిస్తోంది. సుదర్శన్ (87) తన తొలి టెస్టు శతకానికి చేరువలో వికెట్ చేజార్చుకున్నాడు. జొమెల్ వారికన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోవడంతో నిరాశగా పెవిలియన్ చేరాడు.మరోవైపు, ఆరంభంలో ఆచితూచి ఆడిన యశస్వి జైస్వాల్, క్రీజులో కుదురుకున్న తర్వాత తన దూకుడు పెంచాడు. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ పరుగులు పెట్టించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com