India A-Pakistan A: భారత్-పాక్ ఫైనల్ నేడే, ఎక్కడ చూడాలి అంటే...

IND-A vs PAK-A: ఆసియా ఎమర్జింగ్ కప్(ACC Emergins Cup)లో భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
సాధారణంగా భారత్, పాక్ జట్ల మధ్య ఫేవరేట్ ఎవరో చెప్పడం కష్టమే. అయితే ప్రస్తుతం భారత యువజట్టు ఆటతీరును బట్టి చూస్తే భారతే ఫేవరేట్‌గా కనబుడుతోంది. టోర్నీలో ఆడిన అన్ని మ్యాచుల్లో గెలిచింది. టోర్నీలో ఇప్పటికే పాకిస్థాన్‌పై గెలవడం ఆత్మవిశ్వాసం పెంచుతోంది.
కెప్టెన్ యశ్ ధుల్ టోర్నీలో 195 పరుగులతో జట్టుని ముందుండి నడిసిస్తున్నాడు. మరో బ్యాట్స్‌మెన్ సాయిసుదర్శన్ 191 పరుగులతో కీలకంగా కొనసాగుతున్నాడు. ఇక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు నిషాంత్ సింధు, మానవ్ సుతార్‌లు 10 వికెట్లు, 9 వికెట్లతో బౌలింగ్‌ని నడిపిస్తున్నారు.
మరో వైపు పాకిస్థాన్ కూడా బలంగా కనబడుతోంది. ఆ జట్టులోని పలువురు ఆటగాళ్లకు పాకిస్థాన్ జాతీయ జట్టు తరపున, పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆడిన అనుభవం ఉండటంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. సెమీ ఫైనల్లో శ్రీలంకపై 60పరుగులతో గెలవడం కూడా వారికి సానుకూలాంశంగా ఉంది.
ఇండియా A vs పాకిస్తాన్ A, ACC పురుషుల ఎమర్జింగ్ ఆసియా కప్-2023 ఫైనల్ FanCode మొబైల్ యాప్ (Android, iOS), ఆండ్రాయిడ్ TVలో TV యాప్, అమెజాన్ ఫైర్ టీవీ TV Stick, Jio STB, Samsung TV, Airtel XStream, ఓటిటి ప్లే(OTT ప్లే)లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com