Home
 / 
క్రీడలు / Common Wealth Games :...

Common Wealth Games : కామన్‌వెల్త్‌లో వరుస మెడల్స్‌తో దూసుకుపోతున్న భారత్..

Common Wealth Games : కామన్వెల్త్ క్రీడా సంగ్రామంలో భారత్ వెలిగిపోతోంది. పతకాల పంటలతో క్రీడాకారులు దూసుకుపోతున్నారు

Common Wealth Games : కామన్‌వెల్త్‌లో వరుస మెడల్స్‌తో దూసుకుపోతున్న భారత్..
X

Common Wealth Games : కామన్వెల్త్ క్రీడా సంగ్రామంలో భారత్ వెలిగిపోతోంది. పతకాల పంటలతో క్రీడాకారులు దూసుకుపోతున్నారు. భారత కీర్తపతాకాన్ని, సత్తాను విశ్వవ్యాప్తం చేస్తున్నారు. 72 దేశాలు పాల్గొంటున్న ఈ క్రీడా సంగ్రామంలో టాప్-5లో నిలిచింది. చివరి రోజు కూడా భారత్ హవా కొనసాగిస్తోంది.

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు స్వర్ణం సాధించింది. దీంతో పతకాల పట్టికలో భారత్‌ నాలుగో స్థానానికి ఎగబాకింది. తాజాగా బ్యాడ్మింటన్‌ హిళల సింగిల్స్‌ విభాగం ఫైనల్స్‌లో సింధు.. కెనడా క్రీడాకారిణి మిచెలీ లీని ఓడించింది.

తొలి గేమ్‌లో 21-15తో నెగ్గిన సింధు రెండో గేమ్‌ను 21-13తో కైవసం చేసుకుంది. దీంతో వరుస గేమ్స్‌లో ఆధిపత్యం చెలాయించి భారత్‌కు మరో పసిడి అందించింది. ఇటు మెన్స్ సింగిల్స్ లోనూ లక్ష్యసేన్ పసిడి పథకం అందుకున్నారు.

మరోవైపు ఇవాళ జరిగే కీలకమైన గేమ్స్‌లో మరికొన్ని మెడల్స్ వచ్చే అవకాశం లేకపోలేదు. దీంతో భారత్ టాప్-3లోకి దూసుకువచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు 20స్వర్ణాలు, 15 రజతం, 22 కాంస్యంతో మొత్తం 57 పతకాలు సాధించింది భారత్.

జులై 28వ తేదీన ప్రారంభమైన కామన్వెల్త్ గేమ్స్ నేటితో ముగియనున్నాయి. 72 దేశాల క్రీడాకారులు పాల్గొంటున్న ఈ క్రీడలు ముగింపు దశకు చేరిన తరుణంలో భారత్ పతకాల సంఖ్య కూడా పెరుగుతోంది. మునుపెన్నడూ లేని రీతిలో ఈసారి పతకాలను కొల్లగొడుతూ దేశ కీర్తిని చాటుతున్నారు క్రీడాకారులు. భారత క్రీడాకారులు గత రెండు రోజుల నుంచి పూర్వమైన పతకాలను సొంతం చేసుకున్నారు. బర్మింగ్‌హామ్ 2022లో అత్యధిక పతకాలు సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత బాక్సర్ల పంచ్‌లకు పతకాలు వచ్చి పడుతున్నాయి. పురుషుల ఫ్లైవెయిట్‌లో అమిత్‌ పంగల్‌,మహిళల మినిమమ్‌ వెయిట్‌లో నితూ గంఘాస్‌లు బంగారు పతకాలు సాధించారు. ఇంగ్లీష్‌ బాక్సర్‌ కియరన్‌ మెక్‌డొనాల్డ్‌పై అమిత్‌ మొదటి నుంచి ఆధిపత్యం చూపించాడు. మొదటి రౌండ్‌లో 5-0,రెండో రౌండ్‌లో 4-1 తేడాలో విజయం సాధించాడు. నితూ కూడా ఇంగ్లాండ్‌కే చెందిన ప్రత్యర్థి జేడ్‌ రెస్థన్‌పై పంచుల వర్షం కురిపించింది.మొదటి రౌండ్‌ను 4-1 తేడాతో, రెండో రౌండ్‌లోనూ 4-1తేడాతో విజయం సాధించి,గోల్డ్ మెడల్‌ను గెలుచుకుంది.

తెలంగాణ అమ్మాయి ప్రపంచ వేదికపై భారత కీర్తి పతకాన్ని ఎగురవేసింది. కామన్వెల్త్‌ క్రీడల్లో ఈసారి కూడా నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్‌ జరీన్ స్వర్ణం కొల్లగొట్టింది. 48-50 కేజీల విభాగంలో నార్తన్‌ ఐర్లాండ్‌పై అద్భుత విజయం సాధించి పసిడి పతకం గెలుచుకుంది. క్వార్టర్స్‌లో వేల్స్‌ బాక్సర్ హెలెన్ జోన్స్‌పై 5-0 తేడాతో నెగ్గింది నిఖత్.. సెమీస్‌లో ఇంగ్లాండ్‌ బాక్సర్‌ సావనా అల్ఫియాపై 5-0తో అదరగొట్టి ఫైనల్‌ల్లోకి అడుగు పెట్టింది. ఫైనల్లోనూ నిఖత్‌ అదే దూకుడు ప్రదర్శిచింది. తుదిపోరులోనూ కార్లేపై 5-0తో గెలిచి పసిడి పతకం అందుకుంది. నిఖత్‌ జరీన్‌ గోల్డ్‌మెడల్‌ సాధించడంతో సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆమెకు స్వయంగా ఫోన్ చేసి అభినందించారు.

కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఇండియన్‌ పారా టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ భవినా పటేల్‌ చరిత్ర సృష్టించింది. పారా టేబుల్‌ టెన్నిస్‌ సింగిల్స్ 3-5 కేటగిరీలో స్వర్ణం గెలుచుకుంది. గుజరాత్‌కు చెందిన 35 ఏళ్ల భవినా.. ఫైనల్స్‌లో నైజీరియాకు చెందిన క్రిస్టియానాపై 3-0తో విజయం సాధించింది. టీటీలో భారత తరఫున గోల్డ్‌ సాధించిన మొదటి క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది భవినా. అంతకముందు మరో పారా టీటీ ప్లేయర్‌ సోనాల్‌బెన్‌ మనూబాయి పటేల్‌ కాంస్యం సొంతం చేసుకుంది.

బ్యాడ్మింటన్‌లోనూ భారత్‌కు స్వర్ణం గెలిచే అవకాశాలు ఉన్నాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్‌ రంకిరెడ్డి-చిరాగ్‌ శెట్టి జోడీ ఫైనల్స్‌కు చేరుకుంది. ఇప్పటికే బ్యాడ్మింటన్ లో సింగిల్స్ లో భారత్ హవా కొనసాగించింది. డబుల్స్ లోనూ పసిడి పట్టుకోవాలని చూస్తోంది.

కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఇండియన్‌ ఉమెన్స్‌ హాకీ టీం కాంస్య పతకాన్ని సాధించింది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పెనాల్టీ షూటవుట్‌లో 2-1 తేడాతో టీం ఇండియా విజయం సాధించింది. మ్యాచ్‌ చివర్లో న్యూజిలాండ్‌ స్కోరును సమం చేసింది. దీంతో ఆట పెనాల్టీ షూటవుట్‌ కు వెళ్లాల్సి వచ్చింది. పెనాల్టీ షూటవుట్‌లో న్యూజిలాండ్‌ ఒకే గోల్‌ సాధించగా.. టీమ్‌ఇండియా 2 గోల్స్‌తో కాంస్య పతకాన్ని సాధించుకుంది.

ఇక భారత మహిళల క్రికెట్ జట్టు కామన్వెల్త్ లో తొలిసారిగా ఫైనల్స్‌కు చేరుకుంది. భారత జట్టు ఇప్పుడు స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించాలనుకుంటోంది. అయితే, ఆస్ట్రేలియా రూపంలో అత్యంత కఠినమైన సవాలు ఎదుర్కొనుంది భారత్.

Next Story