India Vs England: ఇంగ్లాండ్ జట్టుకు బిగ్ షాక్..!

భారత్- ఇంగ్లాండ్ మధ్య ఈ బుధవారం నుంచి మూడో టెస్టు ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లీష్ టీంకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ మార్క్ వుడ్ హెడింగ్లీ భుజం గాయంతో మూడో టెస్టు నుంచి తప్పుకోనున్నాడు. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టు నాలుగో రోజు ఆటలో ఈ ఇంగ్లాండ్ పేసర్ గాయపడ్డాడు. గాయాల కారణంగా ఇప్పటికే స్టువర్ట్ బ్రాడ్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్, బెన్ స్టోక్స్ లాంటి స్టార్ పేసర్ల సేవలను కోల్పోయిన ఇంగ్లండ్ జట్టును తాజాగా వుడ్‌కు తగిలిన గాయం మరింత కలవరపెడుతోంది.
భారత్‌తో 5 టెస్ట్‌ల సిరీస్‌లో రెండు టెస్ట్‌ల అనంతరం 0-1తో వెనుకబడిన రూట్ సేనకు ఇది పెద్ద ఎదురుదెబ్బ అని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. అయితే మార్క్ వుడ్ జట్టుతోనే ఉంటాడని, వైద్యుల పర్యవేక్షణలో కోలుకోవడంపై దృష్టిసారిస్తాడని ఈసీబీ వెల్లడించింది. మూడో టెస్ట్ అనంతరం అతనికి మరోసారి ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహిస్తామని, అప్పటికీ కోలుకోలేకపోతే సిరీస్ నుంచి తప్పిస్తామని పేర్కొంది. మూడో టెస్ట్ సమయానికి మార్క్ వుడ్ కోలుకుంటాడని ఇంగ్లండ్ జట్టు యాజమాన్యం భావించింది. అయితే వుడ్ పూర్తి ఫిట్‌నెస్ సాధించలేకపోవడంతో అతను మూడో టెస్ట్‌కు దూరంగా ఉంటాడని ఈసీబీ ప్రకటించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com