క్రీడలు

Ind Vs SL 1st ODI: ధావన్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌..శ్రీలంకపై భారత్ ఘనవిజయం

Ind Vs SL 1st ODI: ప్రేమదాస స్టేడియం వేదికగా శ్రీలంకపై తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది.

India vs Srilanka
X

India Vs Srilanka

Ind Vs SL 1st ODI: ప్రేమదాస స్టేడియం వేదికగా శ్రీలంకపై తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టీమిండియా పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఈ మ్యాచ్ లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచిందిమూడు వన్డేల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది టీమిండియా.

తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 262 పరుగులు చేసింది. కెప్టెన్‌ దసున్‌ షనక (50, 39పరుగులు; 2 ఫోర్లు, 1 సిక్స్‌), చమిక కరుణరత్నే (35, 43 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు), రాణించారు. 263 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 36.4 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 263 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ హాఫ్ సెంచరీ (95 బంతుల్లో 86 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌)తో చివరి వరకు క్రీజులో ఉండి జట్టుకు విజయాన్ని అందించాడు. 'బర్త్‌డే బాయ్‌' వన్డేల్లో అరంగేట్రం చేసిన ఇషాన్‌ కిషన్‌ (42 బంతుల్లో 59; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు). పృథ్వీ షా (24 బంతుల్లో 43; 9 ఫోర్లు) మెరుపులు మెరిపించారు.

భారత్‌కు చహల్‌ తొలి వికెట్‌ను అందించాడు. దాంతో 49 పరుగుల వద్ద శ్రీలంక తొలి వికెట్‌ను కోల్పోయింది. స్పిన్నర్ల దెబ్బతో శ్రీలంక స్కోరు బోర్డు వేగం మందగించింది. ఒకదశలో శ్రీలంక 250 మార్కును దాటడం కష్టంగా అనిపించింది. కరుణరత్నే (35 బంతుల్లో 43 నాటౌట్‌; ఫోర్, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడి లంకకు గౌరవప్రద స్కోరు అందించాడు. లక్ష్య ఛేదనలో టీమిండియా ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్పృథ్వీ షా మెరుపు ఆరంభాన్నిస్తే... చివర్లో ధావన్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను ఫినిష్‌ చేశాడు. హిట్టింగ్‌కే ప్రాధాన్యం ఇచ్చిన ఇషాన్‌ 33 బంతుల్లో తొలి అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. రెండు జట్ల ఈ నెల 20న రెండో వన్డే జరగనుంది.

Next Story

RELATED STORIES