అండర్సన్ అరుదైన రికార్డ్.. 70 ఏళ్లలో ఒకే ఒక్కడు

India Vs England: లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్- టీమిండియా మధ్య రెండో టెస్టు జరుతుంది. టీమిండియా ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచులో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జిమ్మీ అండర్సన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల పడగొట్టాడు. గడిచిన 70 ఏళ్లలో.. ఈ ఘనత సాధించిన అత్యంత పెద్ద వయస్కుడైన(39 ఏళ్ల 14 రోజులు) పేసర్‌గా జిమ్మీ అండర్సన్ రికార్డుల్లోకెక్కాడు. టెస్టులో అండర్సన్‌కు ఇది 31వ సారి 5 వికెట్ల ఘనత సాధించాడు. భారత్‌పై మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. నాలుగుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన, రెండుసార్లు నాలుగు వికెట్ల ప్రదర్శనతో మొత్తంగా 33 వికెట్లు పడగొట్టాడు.
దక్షిణాఫ్రికా ఆటగాడు జెఫ్ చబ్ టెస్టు క్రికెట్‌లో అత్యంత పెద్ద వయసులో 5 వికెట్లు సాధించాడు. 1951లో ఇంగ్లండ్‌తో మాంచెస్టర్‌లో జరిగిన టెస్టులో జెఫ్ చబ్ ఈ ఘనత సాధించాడు. అప్పటికి అతడి వయసు 40 ఏళ్ల 86 రోజులు. 70 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అండర్సన్ 39 ఏళ్ల 14 రోజుల వయసులో 5 వికెట్ల ఘనత సాధించాడు. లార్డ్స్ టెస్టు తొలి రోజు రోహిత్ శర్మ, పుజారాలను ఔట్ చేసిన అండర్సన్.. రెండో రోజు రహానే, ఇషాంత్ శర్మ, బుమ్రా వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుత ఆటగాళ్లలో అశ్విన్ (30), స్టువర్ట్ బ్రాడ్ (18), షకిబుల్ హాసన్ (18), నాథన్ లియోన్ (18) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అండర్సన్ 164 టెస్టుల్లో 626 వికెట్లుతో కొనసాగుతున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com