IND vs ENG 2nd Test: బాల్ ట్యాంపరింగ్ కలకలం..కెమెరాకి చిక్కిన క్రికెటర్లు

IND vs ENG 2nd Test: బాల్ ట్యాంపరింగ్ కలకలం..కెమెరాకి చిక్కిన క్రికెటర్లు
India Vs England:లార్డ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో బాల్ ట్యాంపరింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది.

లార్డ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో బాల్ ట్యాంపరింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఇంగ్లాండ్ ఆటగాళ్లు బాల్ టాంపరింగ్‌కి పాల్పడుతూ కెమెరాకి చిక్కారు. నాలుగో రోజు సెకండ్ సెషన్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు షూ కింద పెట్టి గట్టిగా తొక్కుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆదివారం భోజన విరామం తర్వాత అజింక్య రహానె (61: 146 బంతుల్లో 5x4), చతేశ్వర్ పుజారా (45: 206 బంతుల్లో 4x4) బ్యాటింగ్ చేస్తుండగా.. ఇద్దరు ఇంగ్లాండ్ క్రికెటర్లు తమ బుట్ల కింద స్పైక్స్‌తో బంతిని తొక్కడం కెమెరా కంటపడింది. ఈ ఇద్దరు ఎవరు అనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.

ఈ విషయంపై ఇంగ్లండ్ బోర్డు వివరణ ఇస్తుందో, లేదో చూడాలి. ప్రస్తుతానికైతే ఆట చక్కగా కొనసాగుతోంది. కాగా, ఇది కచ్చితంగా బాల్‌ ట్యాంపరింగ్ ప్రయత్నమేనంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కామెంటేటర్ ఆకాశ్ చోప్రా భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్ లార్డ్స్‌లో బాల్ టాంపరింగ్‌పై ట్వీట్స్ చేశారు. ఆకాశ్ చోప్రా బాల్ ట్యాంపరింగ్‌లానే ఉందని అభిప్రాయపడ్డాడు. మూడో రోజు ఆటలో పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు సహకరించింది. బౌలర్లు ఎంత ప్రయత్నించినా బంతిని స్వింగ్ చేయలేకపోయారు. దీనిని సద్వినియోగం చేసుకున్న ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. కొంత స్వింగ్ కావడంతో ఇంగ్లండ్ బౌలర్లు మూడు వికెట్లను పడగొట్టారు. ఆ తర్వాత తేమ తగ్గిపోవడంతో బంతి స్వింగ్‌కు అనుకూలించడం లేదు. బంతి అంతంత మాత్రంగానే సహకరిస్తుండడంతో బౌలర్లు ఈ పని చేసి ఉంటారని భావిస్తున్నారు. కాగా, బంతిని బూట్ల కింద పెట్టి దానిని ఆకారాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్న ఫొటోలు అంపైర్ల దృష్టిని ఆకర్షించాయి.



Tags

Next Story