సండే ధమాకాకు ఇండియా, ఇంగ్లండ్ జట్లు రెడీ..!

సండే ధమాకాకు ఇండియా, ఇంగ్లండ్ జట్లు రెడీ..!
సండే ధమాకాకు ఇండియా, ఇంగ్లండ్ జట్లు రెడీ అయ్యాయి. పూణె వేదికగా జరిగే మూడో వన్డేతో టైటిల్‌ వేటకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే రెండు మ్యాచుల్లో చెరోకటి గెలిచాయి.

సండే ధమాకాకు ఇండియా, ఇంగ్లండ్ జట్లు రెడీ అయ్యాయి. పూణె వేదికగా జరిగే మూడో వన్డేతో టైటిల్‌ వేటకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే రెండు మ్యాచుల్లో చెరోకటి గెలిచాయి. దీంతో నిర్ణయాత్మక మూడో వన్డే ఆసక్తిగా మారింది. రెండో వన్డేలో భారీ స్కోరు చేసినా ఇంగ్లండ్ ఛేదించి విజయం సాధించడంతో జట్టులో మార్పులు చేయాలని కోహ్లీసేన భావిస్తోంది. బ్యాటింగ్ ఆర్డర్‌తో పెద్దగా ఇబ్బందిలేకపోయినా ..బౌలింగ్‌ విభాగంలో మాత్రం మార్పులు తప్పనసరిగా కనిపిస్తోంది..

రెండో వన్డేలో 336 పరుగల స్కోరును కూడా కాపాడుకోలేక పోయారు మన బౌలర్లు. స్పిన్నర్ కుల్దీప్‌ యాదవ్ మరోసారి భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అటు పేస్ విభాగంలో ఒక్క భువనేశ్వర్ కుమార్ తప్ప మిగతా ఇద్దరూ తేలిపోయారు.. దీంతో తుది జట్టులోకి లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ నటరాజన్ లేదా హైదరాబాదీ సీమర్ సిరాజ్ ను తీసుకునే అవకాశం ఉంది. అటు ఇంగ్లీష్ జట్టు మాత్రం ఎలాంటి మార్పుల్లేకుండానే బరిలోకి దిగనుంది.

Tags

Read MoreRead Less
Next Story