టీమిండియా 12వ బ్యాట్స్‎మెన్.. గ్రౌండ్‎లో నుంచి గెంటేసిన సెక్యూరిటీ..!

టీమిండియా 12వ బ్యాట్స్‎మెన్.. గ్రౌండ్‎లో నుంచి గెంటేసిన సెక్యూరిటీ..!
Jarvo 69 on Ground: టీమిండియా - ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ కొనసాగుతుంది.

India Vs England: టీమిండియా - ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ కొనసాగుతుంది. లీడ్స్ వేదికగా మూడో టెస్టు నాలుగో రోజు టీమిండియా బ్యాటింగ్ చేస్తుంది. నాలుగో రోజు అనూహ్య ఘటన చోటుచేసుకుంది లార్డ్స్ లో జరిన రెండో టెస్టులో ఓ ఇంగ్లండ్‌ అభిమాని ఏకంగా టీమిండియా జెర్సీ ధరించి మైదానంలోకి ప్రవేశించడం అందరినీ అయోమయానికి గురిచేసింది. అతను ధరించిన జెర్సీ వెనక 'జర్వో 69' అనే పేరు ఉంది. ఆ జర్వో 69 మళ్లీ మైదానంలో తళుక్కున మెరిశాడు. మూడో టెస్టులోనూ ఆ వ్యక్తి మళ్లీ మైదానంలోకి రావడం కలకలం సృష్టించింది.

'జర్వో 69' (Jarvo 69) మూడో రోజు ఆటలో రోహిత్‌శర్మ ఔటైనప్పుడు బ్యాటు పట్టుకొని, హెల్మెట్‌ ధరించి మైదానంలోకి నడిచాడు. ఐతే అతడి ముఖానికి సర్జికల్‌ మాస్క్‌ ఉండటంతో గుర్తించిన సిబ్బంది వెంటనే అతడిని బయటకు తీసుకెళ్లారు. 'జర్వో 69' సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి అతడు మైదానంలోకి ఎలా అడుగు పెడుతున్నాడో ఎవరికీ అంతుపట్టడం లేదు.

రెండో టెస్టులోనూ లంచ్‌ బ్రేక్‌ తర్వాత ఇతర ఆటగాళ్ల వెనుక వచ్చిన అతడు ఫీల్డింగ్‌ సెట్‌ చేస్తూ కనిపించాడు. సాధారణ ఫీల్డర్లా ప్రవర్తించాడు. అక్కడికి వెళ్లు.. దూరంగా నిలబడు.. అంటూ సైగలు చేసి ఫీల్డింగ్‌ సెట్‌చేశాడు. టీమిండియా ప్లేయర్లు రవీంద్ర జడేజా, మహ్మద్‌ సిరాజ్‌ నిజంగానే అతడిని ఆటగాడిగా భావించారు. నిజం తెలిసిన అభిమానులు మాత్రం స్టాండ్స్‌లో నవ్వుకున్నారు.


Tags

Read MoreRead Less
Next Story