క్రీడలు

Viral Video: ఇంగ్లాండ్ ఫ్యాన్స్ అతి.. సిరాజ్‌ స్ట్రాంగ్ కౌంటర్

India Vs England: లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లాండ్ అభిమానులు హద్దులు దాటారు.

Viral Video: ఇంగ్లాండ్ ఫ్యాన్స్ అతి.. సిరాజ్‌ స్ట్రాంగ్ కౌంటర్
X

India Vs England: లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లాండ్ అభిమానులు హద్దులు దాటారు. టీమిండియా బౌలర్ మహ్మద్‌ సిరాజ్‌పై బంతి విసిరారు. పదేపదే అపహస్యం చేసేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. మూడో టెస్టులో టీమిండియా బ్యాట్స్మెన్ తేలిపోయారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకొని మరి ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్ 78 పరుగులకే టీమిండియా చాపచూట్టేసింది. అనంతరం బ్యాటింగ్ తొలిరోజు ఆట ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 120 పరుగులు చేసింది.

మూడో టెస్టులో ఇంగ్లీషు అభిమానులు కాస్త అతి చేస్తున్నారు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్నటీమిండియా బౌలర్ మహ్మద్‌ సిరాజ్‌పై బంతి విసిరారు. అంతేకాకుండా స్కోరెంత అని అడుగుతూ అపహస్యం చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని వికెట్‌ కీపర్‌ రిషభ్ పంత్‌ మీడియాకు తెలిపాడు.

ఇంగ్లాండ్‌ అభిమానుల్లో ఎవరో సిరాజ్‌(Mohammed Siraj)పైకి బాల్ విసిరారు. దానిని చూసిన కోహ్లీ ఆ బంతిని వారిపైనే విసిరేయాలని సైగ చేశాడు. మరికొందరు స్కోరెంత అని ఎగతాళి చేస్తూ సిరాజ్‌ను ప్రశ్నించారు. అతడు తెలివిగా 1-0 అని సిరీసులో అన్నాడు. ఇప్పటికే భారత్ ఒక మ్యాచ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.Next Story

RELATED STORIES