టీమిండియాకు షాక్..శ్రీలంక ఉత్కంఠ విజయం..ఆఖరి మ్యాచ్

India vs Srilanka: శ్రీలంక-భారత్ మధ్య జరిగిన రెండో టీ20లో టీమిండియాకు షాక్ తగిలింది. కొలంబో వేదికగా బుధవారం జరిగిన ఈ మ్యాచులో భారత్ నిరాశపరిచింది. శ్రీలంక టీమిండియాపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దాంతో.. మూడు టీ20ల సిరీస్ 1-1తో సమయం చేసింది. నిర్ణయాత్మక ఆఖరి టీ20 మ్యాచ్ గురువారం రాత్రి కొలంబో వేదికగానే జరగనుంది. మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులే చేయగలిగింది. కెప్టెన్ శిఖర్ ధావన్ (40: 42 బంతుల్లో 5x4) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కొత్తగా జట్టులోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ (21), దేవదత్ పడిక్కల్ (29) నిరాశపరచగా.. సంజు శాంసన్ (7), నితీశ్ రాణా (9) తేలిపోయారు. దాంతో భారత్ తక్కువ స్కోరుకే పరిమితమైంది.
133 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంకకి ఓపెనర్ మినోద్ భానుక (36: 31 బంతుల్లో 4x4), ధనంజయ డిసిల్వా (40 నాటౌట్: 34 బంతుల్లో 1x4, 1x6) పోరాటపటిమ చూపించడంతో శ్రీలంక విజయం సాదించింది. తొలుత విజృంభించిన భారత బౌలర్లు శ్రీలంక జట్టుని ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అవిష్కా ఫెర్నాండో (11), సమరవిక్రమ (8), కెప్టెన్ దసున్ షనక (3), హసరంగ (15), రమేశ్ మెండిస్ (2) కీలక సమయాల్లో వికెట్లు చేజార్చుకున్నారు. తర్వాత టీమిండియా బౌలర్లు వికెట్లు తీయడంలో విఫలమైయ్యారు.
చివర్లో కరుణరత్నె (12 నాటౌట్), డిసిల్వా జోడీ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే గెలుపు లాంఛనాన్ని 133/6తో పూర్తి చేశారు. టీమిండియాల బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టగా.. భువి, రాహుల్ చాహర్, వరుణ్ చక్రవర్తి, చేతన్ సకారియా తలా ఓ వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో టీమిండియా కీలక ప్లేయర్లు దూరమైయ్యారు. కృనాల్ పాండ్యాకు కరోనా సోకడంతో అతనితో సన్నిహితంగా ఉన్న ప్లేయర్లను కూడా బీసీసీఐ కొవిడ్ పరీక్షలు నిర్వాహిస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com