Common wealth Games : వరుస మెడల్స్‌తో సత్తా చాటుతున్న భారత్..
Common wealth Games : బర్మింగ్‌హమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ అదరగొడుతోంది

Common wealth Games : బర్మింగ్‌హమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ అదరగొడుతోంది. ఐదో రోజు మొత్తం నాలుగు పతకాలు సాధించింది. ఇందులో రెండు గోల్డ్ మెడల్స్, రెండు సిల్వర్ మెడల్స్ ఉన్నాయి. టేబుల్ టెన్నిస్, లాన్ బౌల్స్ టీమ్స్ గోల్డ్ మెడల్స్ సాధించగా..బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీం, వెయిట్ లిఫ్టింగ్‌లో వికాస్ ఠాకూర్ సిల్వర్ మెడల్ అందుకున్నారు.
ఇంగ్లండ్ బర్మింగ్‌హమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. ఐదో రోజు మరో నాలుగు మెడల్స్ సాధించారు భారత అథ్లెట్లు. రెండు గోల్డ్ మెడల్స్‌తో పాటు రెండు సిల్వర్ మెడల్స్ భారత్ ఖాతాలో చేర్చారు. దీంతో భారత్ పతకాల సంఖ్య 13కు చేరింది.
ఇందులో 5 గోల్డ్ మెడల్స్ ఉండగా...5 సిల్వర్ మెడల్స్, మూడు బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. మొత్తం 13 పతకాలతో పతకాల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది భారత్. అత్యధికంగా 101 పతకాలతో ఆస్ట్రేలియా ఫస్ట్ ప్లేసులో ఉంది.
ఇక నిర్ణయాత్మక ఫైనల్ మ్యాచులో ఓడిన బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ ప్లేయర్స్ సిల్వర్ పతకాన్ని గెలుచుకున్నారు. మలేసియాతో జరిగిన ఫైనల్ పోరులో 1-3 తేడాతో ఓటమి పాలయ్యారు. త్రిష జోలి, గాయత్రి గోపిచంద్...మురళీధరన్ టినా, కూంగ్ లీ పెర్లి చేతిలో ఓడిపోయారు. కిదాంబి శ్రీకాంత్ యంగ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. విమెన్ సింగిల్ మ్యాచ్‌లో పీవీ సింధు విజయం సాధించింది.
భారత మెన్స్ టేబుల్ టెన్నిస్ టీం అదర గొట్టింది. ఫైనల్ మ్యాచులో సింగపూర్‌పై 3-1 తేడాతో విజయం సాధించింది. దీంతో భారత్ ఖాతాలో ఐదో గోల్డ్ మెడల్ చేరింది. ఇక వెయిట్ లిఫ్టింగ్ మెన్స్ 96 కేజీల విభాగంలో వికాస్ ఠాకూర్ సిల్వర్ మెడల్ గెలుపొందాడు. మొత్తం 346 కేజీలు ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు.
అటు లాన్ బౌన్స్‌లో భారత మహిళల జట్టు హిస్టరీ క్రియేట్ చేసింది. కామన్వెల్త్ గేమ్స్‌లో ఫస్ట్ టైం గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఫైనల్‌లో సౌతాఫ్రికాపై 17-10 తేడాతో గెలుపొందింది. లవ్లీ చౌబే, రూపా రాణి, పింకీ, నయన్ మోనీ సైకియాలతో కూడిన భారత లాన్ బౌల్స్ బృందం ఈ చరిత్ర సృష్టించింది. దీంతో భారత్ గోల్డ్ మెడల్స్ సంఖ్య 5 కు చేరింది.
RELATED STORIES
Rakhi Removing : అప్పుడు మాత్రమే రాఖీని తీసివేయాలి.. లేదంటే..?
13 Aug 2022 1:28 AM GMTBadam Tea: బాదం టీతో ఆరోగ్యం.. అందం కూడా..
11 Aug 2022 2:35 AM GMTCoffee with Ghee: క్రేజీ కాంబినేషన్.. నెయ్యితో కాఫీ
10 Aug 2022 6:00 AM GMTWater: ఎక్కువ నీరు త్రాగడం హానికరమా.. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు..
8 Aug 2022 9:15 AM GMTDiabetic Foot Symptoms: చక్కెర వ్యాధి గ్రస్తులకు పాదాల సమస్యలు.....
6 Aug 2022 9:30 AM GMTEight lifestyle tips: వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఎనిమిది...
4 Aug 2022 9:14 AM GMT