క్రీడలు

Common Wealth Games : కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్ పతకాల వేట..

Common Wealth Games : కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. ఆరో రోజు ఐదు మెడల్స్‌ తన ఖాతాలో వేసుకుంది భారత్.

Common Wealth Games : కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్ పతకాల వేట..
X

Common Wealth : కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. ఆరో రోజు ఐదు మెడల్స్‌ తన ఖాతాలో వేసుకుంది భారత్. మొత్తంగా భారత్ మెడల్స్ సంఖ్య 18కి పెరిగింది. ఇందులో ఉన్నాయి. మొత్తంగా ఆరో రోజు నాలుగు కాంస్య పతకాలతో పాటు ఓ రజత పతకం భారత్‌ ఖాతాలో చేరింది.

స్క్వాష్‌ ప్లేయర్‌ సౌరవ్ ఘోషల్‌ కాంస్యం పతకం గెలిచాడు. ఇంగ్లండ్‌ ప్లేయర్‌ జెమ్స్ విల్‌స్ట్రాప్‌తో జరిగిన సింగిల్స్ మ్యాచులో 11-6, 11-1, 11, 4 తేడాతో సౌరవ్ గెలిచాడు. కామన్వెల్త్ క్రీడల్లో ఇండియాకు స్వ్కాష్‌ సింగిల్స్ విభాగంలో పతకం రావడం ఇదే మొదటి సారి. వెయిట్‌ లిఫ్టింగ్ మెన్స్‌ 109 కేజీల విభాగంలో కాంస్యం గెలిచాడు లవ్‌ ప్రీత్ సింగ్‌.

మొత్తం 355 కేజీలు ఎత్తి రికార్డు సృష్టించాడు. వెయిట్‌ లిఫ్టింగ్ విభాగంలో ఇప్పటివరకూ ఇండియాకు ఒక గోల్డ్ మెడల్ సహా మొత్తం 8 మెడల్స్ వచ్చాయి. అటు వెయిట్‌ లిఫ్టింగ్ 109 కేజీల పైబడిన విభాగంలో గురుదీప్‌ సింగ్‌ సైతం కాంస్య పతకం సాధించాడు. పైనల్‌లో 390 కేజీలు ఎత్తాడు. హై జంప్‌లో తేజస్విన్ శంకర్‌ కాంస్య పతకం గెలిచాడు. జూడో 78 కేజీల విభాగంలో తులికా మన్‌ రజత పతకం సాధించింది.

ఇక బాక్సింగ్‌లో భారత్‌కు మరో మూడు పతకాలు ఖాయమయ్యాయి. విమెన్ బాక్సింగ్‌ 48-50 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ పతకం ఖాయం చేసింది. వేల్స్‌కు చెందిన హెలెన్‌ జోన్స్‌పై గెలిచి సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. హుస్సాముద్దీన్ మహ్మద్, నీతూ ఘంగాస్‌ సైతం మెడల్స్ రేసులో నిలిచారు. పురుషుల 57 కేజీల విభాగం క్వార్టర్‌ ఫైనల్‌లో హుస్సాముద్దీన్‌.. నమీబియాకు చెందిన ట్రయాగైన్‌ మార్నింగ్‌పై విజయం సాధించాడు.

ఈ విజయంతో సెమీస్‌కు దూసుకెళ్లాడు. మరోవైపు 21 ఏళ్ల మహిళా బాక్సర్‌ నీతూ ఘంగాస్ క్వార్టర్ ఫైనల్ లో ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన నికోల్ క్లాయిడ్‌ను ఓడించి పతకం ఖాయం చేసింది.

కామన్వెల్త్ గేమ్స్‌ గ్రూప్‌-ఏలో భాగంగా బార్బడోస్‌తో జరిగిన క్రికెట్‌ మ్యాచులో భారత మహిళలు సత్తా చాటారు. మొదట టాస్‌ గెలిచిన బార్బడోస్‌ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో షెఫాలి వర్మ, రోడ్రిగ్స్ రాణించారు. తర్వాత 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బార్బడోస్‌ను భారత బౌలర్లు 62 పరుగులకే కట్టడి చేశారు.

మొత్తం 20 ఓవర్లు ఆడిన బార్బడోస్ 8 వికెట్లు కోల్పోయి 62 రన్స్ చేసింది. భారత్ బౌలర్లలో రేణుకా సింగ్ 4 వికెట్లతో రాణించింది. ఈ గెలుపుతో టీమిండియా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్‌లో విజేతతో ఇండియా తలపడనుంది.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES