Third T20 : అదరగొట్టిన భారత్.. విండీస్‌పై ఏడు వికెట్లతో విజయం..
Third T20 : విండీస్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ అదరగొట్టింది

Third T 20: విండీస్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ అదరగొట్టింది. 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టుపై విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచులో సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. టీమిండియా విజయంలో సూర్య కుమార్ యాదవ్ కీ రోల్ ప్లే చేశాడు.
వెస్టిండీస్‌తో సెయింట్ కిట్స్ వేదికగా జరిగిన మూడో టీ ట్వంటీలో భారత్ ఘన విజయం సాధించింది. విండీస్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. విండీస్ నిర్దేశించిన 165 పరుగుల టార్గెట్‌ను మరో ఓవర్ ఉండగానే చేధించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచుల సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బ్యాటింగ్‌లో రాణించిన సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
మొదట టాస్ గెలిచి విండీస్‌ను బ్యాటింగ్ ఆహ్వానించింది టీమిండియా. ఐతే విండీస్ ఓపెనర్లు బ్రాండన్ కింగ్, మేయర్స్ ఆ జట్టుకు చక్కటి ప్రారంభాన్ని అందించారు. మొదటి వికెట్‌కు వీరిద్దరు 57 రన్స్ జోడించారు. ఐతే బ్రాండన్ కింగ్‌ను హార్దిక్ పాండ్యా పెవిలియన్ చేర్చాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన పూరన్‌తో కలిసి జట్టు స్కోరును ముందుకు నడిపించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. 22 పరుగులు చేసిన పూరన్ భువనేశ్వర్ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. తర్వాత పావెల్ 23, హెట్ మేయర్ 20 పరుగులతో రాణించడంతో విండీస్ 20 ఓవర్లలో 164 పరుగులు చేసింది. విండీస్ బ్యాట్స్‌మెన్లలో మేయర్ 73 రన్స్ చేశాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ రెండు వికెట్లు పడగొట్టగా..హార్దిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్ తలో వికెట్ తీశారు.
165 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్‌కు మొదట్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ 11 పరుగులు చేసి రిటైర్డ్ హార్ట్‌గా పెవిలియన్ చేరాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్...ఓపెనర్ సూర్య కుమార్ యాదవ్‌తో కలిసి జట్టును ముందుకు నడిపించాడు. జట్టు స్కోరు 105 పరుగుల దగ్గర శ్రేయస్ అయ్యర్ అవుటయ్యాడు. తర్వాత రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ స్కోరును పరుగులు పెట్టించారు. జట్టు స్కోరు 135 పరుగుల దగ్గర సూర్యకుమార్ యాదవ్ పెవిలియన్ చేరాడు. మొత్తం 44 బాల్స్ ఆడిన సూర్య కుమార్...4 సిక్సులు, 8 ఫోర్ల సాయంతో 76 పరుగులు చేశాడు. తర్వాత హార్దింక్ పాండ్యా, దీపక్ హుడాలతో కలిసి భారత్‌ను గెలిపించాడు పంత్.
సెయింట్ కిట్స్‌లో జరిగిన టీ20 మ్యాచుల్లో ఇప్పటివరకూ ఇదే హయ్యెస్ట్ చేజింగ్. 2019 జులై నుంచి ఇప్పటివరకూ 21 టీ 20 మ్యాచుల్లో లక్ష్య చేధనకు బరిలోకి దిగిన టీమిండియా 19 సార్లు విజయవంతమైంది.
RELATED STORIES
Nupur Sharma : నుపుర్ శర్మను చంపాలనుకున్న ఉగ్రవాది అరెస్ట్..
13 Aug 2022 1:45 AM GMTTS High Court : తెలంగాణ హైకోర్టుకు ఆరుగురు కొత్త జడ్జిలు
12 Aug 2022 5:13 PM GMTBobby Kataria : విమానంలో సిగరెట్ తాగిన బాబీ కటారియా.. ఎలా కవరింగ్...
12 Aug 2022 3:29 PM GMTAamir Khan : అమీర్ ఖాన్ అస్సాం టూర్‌ను క్యాన్సల్ చేసుకోమన్న అస్సాం...
12 Aug 2022 3:06 PM GMTUP Constables : రోడ్డెక్కిన యూపీ కానిస్టేబుల్.. ఎందుకంటే..?
12 Aug 2022 1:10 PM GMTBihar Politics : దాని వల్ల శాంతి వస్తుందంటే ఇంట్లోనే ఆఫీసు ఏర్పాటు...
12 Aug 2022 9:01 AM GMT