భారత ఆటగాళ్లకు ఘనస్వాగతం!

ఆస్ట్రేలియా టూర్ ముగించుకొని స్వదేశానికి వచ్చిన భారత క్రికెటర్లకు ఎయిర్ పోర్టుల్లో ఘన స్వాగతం లభించింది. కంగారూల గడ్డపై దాదాపు 2 నెలల పర్యటన తర్వాత రహానే, పృథ్వీ షా, కోచ్ రవిశాస్త్రి.. ఇవాళ ముంబై విమానాశ్రయంలో దిగారు. వారికి అభిమానులు బొకేలతో స్వాగతం పలికారు. అయితే వారికి కరోనా టెస్టులు చేసిన అధికారులు కొన్నిరోజులు హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు.
కాగా భారత్ 2-1 తేడాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సొంతం చేసుకుంది. ఆసీస్ తో టెస్ట్ సిరీస్ ని ముగించుకున్న భారత్... ఇంగ్లాండ్ తో సొంతగడ్డపై జరిగే నాలుగు టెస్టుల సిరీస్ కి సిద్దం కానుంది. ఫిబ్రవరి అయిదు నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్ట్ మొదలు కానుంది. భారత ఆటగాళ్లు ఇంగ్లాండ్ తో సిరీస్ కోసం జనవరి 29న శిక్షణ శిబిరంలో కలవనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com