NeerajChopra: నీరజ్ జావెలిన్ త్రో విసిరేది నేడే.. ఎక్కడ చూడాలి అంటే..!

ఒలింపిక్ బంగారు పతక విజేత, జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా డైమండ్‌లీగ్‌లో జూన్ 30న, అంటే నేడు, ఈవెంట్‌లో పాల్గొననున్నాడు. స్విట్జర్లాండ్‌లోని లాసెన్నెలో త్రో విసిరి మరోసారి సత్తా చాటాలని చూస్తున్నాడు. డైమండ్ లీగ్‌లో రెండో లెగ్ ఈ రోజు జరగనుంది. ఖతార్ దోహాలో మే 5న జరిగిన మొదటి లెగ్‌లో అందరికంటే దూరం విసిరి, సీజన్‌ని ఘనంగా ప్రారంభించిన నీరజ్ చోప్రా 8 పాయింట్లతో పట్టికలో మొదటి స్థానంలో ఉన్నాడు. దోహాలో 88.67 మీటర్లు విసిరి కెరీర్‌లో 4వ ఉత్తమ త్రో విసిరాడు.
కండరాలకు గాయంతో నెలరోజుల పాటు దూరంగా ఉన్న నీరజ్ ఇప్పుడు కూడా మొదటి స్థానాన్ని నిలుపుకోవాలని చూస్తున్నాడు.
నీరజ్ మే 29న తన గాయంపై ఒక ప్రకటన విడుదల చేశాడు. ముందుజాగ్రత్త చర్యగా జూన్ 4న నెదర్లాండ్‌లో జరిగిన FBK పోటీల్లో పాల్గొనబోనని తెలిపాడు. ఫిన్లాండ్‌లో జరిగిన పావో నుర్మి పోటీల్లో కూడా పాల్గొనలేదు. రాబాట్, రోమ్, పారిస్, ఓస్లోలో జరిగిన ఈవెంట్లలో రోస్టర్ ప్రకారం పురుషుల జావెలిన్ త్రో లేకపోవడం నీరజ్‌కు కలిసి వచ్చింది. శుక్రవారం జరగనున్న ఈవెంట్‌లో నీరజ్‌కి ఒలంపిక్ రజత పతక విజేత వాద్లెక్, రెండుసార్లు వరల్డ్ ఛాంఫియన్ పీటర్స్ నుంచి గట్టి పోటీ ఎదురవనుంది.
ఈ డైమండ్ లీగ్‌లో నీరజ్ ఒక్కడే కాకుండా, మరో భారత ఆటగాడు మురళీ శ్రీశంకర్ కూడా పోటీ పడనున్నాడు. మురళీ ప్రస్తుతానికి పోడియం ఫినిషనర్‌గా నిలిచాడు. శుక్రవారం జరగనున్న లాంగ్‌జంప్ ఈవెంట్‌లో తను పోటీ పడనున్నాడు.
నీరజ్ జావిలిన్ త్రోని ఎక్కడ, ఎప్పుడు చూడాలి...
డైమండ్ లీగ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 11.౩౦ గంటలకు ప్రసారం కానుంది. భారత్‌లో స్పోర్ట్స్‌౧౮ నెట్‌వర్స్ ఛానెల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. భారత అభిమానులు నీరజ్ ఆటని చూడాలనుకుంటే జియో సినిమా యాప్, వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com