IndW vs BanW: రెండో వన్డేలో భారత్ విజయం, సిరీస్‌లో సమం

బంగ్లాదేశ్(Bangladesh)తో జరుగుతున్న 2వ వన్డే(ODI)లో భారత మహిళల జట్టు 108 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. గత మ్యాచ్‌లో ఓడిన భారత్(India) ఈ మ్యాచ్‌తో సిరీస్‌ని 1-1తో సమం చేసింది. భారత బ్యాట్స్‌ఉమెన్ జెమీయా రోడ్రిగ్స్ 9 ఫోర్లతో 86 పరుగులతో పాటు, బౌలింగ్‌లో 4 వికెట్లతో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 52 పరుగులతో రాణించింది.
229 పరుగుల లక్ష్య చేదనతో బంగ్లా అనూహ్యంగా వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను చేజేతులా జార్చుకుంది. కేవలం 16 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోవడం విశేషం. బంగ్లా బ్యాట్స్‌మెన్ పర్గానా(47), రీతు(27) తప్ప మిగతా ఎవ్వరూ పెద్దగా ప్రతిఘటించలేదు. 5 ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయింది. 10 ఓవర్లకు 22 పరుగులు మాత్రమే చేసింది. 14వ ఓవర్లో రానా బౌలింగ్‌లో బంగ్లా బ్యాట్స్‌మెన్ లతా బౌల్డై వెనుదిరింగింది. తర్వాత వచ్చిన రితు, ఫర్గానాలు ధాటిగా బంగ్లాని మంచి పొజిషన్‌లో ఉంచారు. 104 పరుగుల వద్ద 4వ వికెట్‌గా స్టంపౌటై ఫర్గానా ఔటయ్యింది. అప్పటి నుంచి బంగ్లా ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ఫర్గానా స్టంపౌట్‌తో సహా తర్వాత రెండు వికెట్లూ స్టంపౌట్‌లో రూపంలో వెనుదిరిగారు. 120 పరుగులకే కుప్పకూలింది.
అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 17 పరుగుల వద్ద ప్రియా పూనియా వికెట్ కోల్పోయింది. స్మృతి మంధన(36), యాస్తికాలు(15) 10 ఓవర్ల దాకా వికెట్ పడకుండా ఆడారు. 11వ ఓవర్లో యాస్తిక అనూహ్య రీతిలో బౌలింగ్ ఎండ్‌లో రనౌట్ అయింది. కుదురుకున్నట్లుగా కనబడ్డ స్మృతి క్రీజు ముందుకు వచ్చి ఆడబోయి బౌల్డయింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్, జెమీయాలు ఫోర్లతో స్కోర్‌బోర్డును పెంచారు. ఈ క్రమంలో 56 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. హర్మన్ ప్రీత్ మధ్యలోనే రిటైర్డ్ హర్ట్‌గా వెనక్కి వెళ్లింది. తర్వాత వచ్చిన హర్లీన్‌తో కలిసి జెమియా వేగంగా ఆడింది. హర్లీన్ ఔటయిన తర్వాత మళ్లీ బ్యాటింగ్‌కి వచ్చిన హర్మన్‌ప్రీత్ 83 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. హర్మన్‌ప్రీత్ సుల్తానా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించగా బౌండరీ వద్ద రబేకా ఖాన్ అద్భుతమైన క్యాచ్ పట్టింది. చివరకు 50 ఓవర్లలో 8 వికెట్లకు 228 పరుగులు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com