IND vs ENG: చరిత్ర సృష్టించిన టీమిండియా

ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా గ్రాంఢ్ విక్టరీ సాధించింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్‌పై సాధికారక విజయాన్ని నమోదు చేసింది. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌పై టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా నిలిచింది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ రాణించి ఇంగ్లండ్‌పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ 336 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ను గిల్ సేన 1-1తో సమం చేసింది. ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియాకు ఇది మొదటి టెస్టు విజయం నమోదు చేసుకుంది. 608 పరుగుల లక్ష్య ఛేదనలో సెకండ్ ఇన్నింగ్స్‌లో ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 72/3తో ఐదో రోజు ఆటను స్టార్ట్ చేసింది. 271 రన్స్ కి ఆలౌటైంది.
పోరాడిన జేమీ స్మిత్
ఇంగ్లాండ్ బ్యాటింగ్ లో జేమీ స్మిత్ (99 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 88 పరుగులు) ఒక్కడే పోరాడాడు. బ్రైడన్ కార్స్ (38), బెన్ స్టోక్స్ (33), ఓలీ పోప్ (24), హ్యారీ బ్రూక్ (23) పరుగులే చేశారు. ఇక, టీమిండియా పేసర్ ఆకాశ్ దీప్ (6/99) ఇంగ్లాండ్ జట్టు పతనాన్ని ఒంటి చేతితో శాసించాడు. మరోవైపు, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, జడేజా తలో వికెట్ తీసుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 587, ఇంగ్లాండ్ 407 రన్స్ చేసిన సంగతి తెలిసిందే. . 608 పరుగుల లక్ష్యఛేదనలో రెండో ఇన్నింగ్స్‌లో ఓవర్‌నైట్ స్కోరు 72/3తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్.. 271 పరుగులకు ఆలౌటైంది. జేమీ స్మిత్ (88; 99 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఒక్కడే పోరాడాడు. బ్రైడన్ కార్స్ (38), బెన్ స్టోక్స్ (33; 73 బంతుల్లో), ఓలీ పోప్ (24), హ్యారీ బ్రూక్ (23) పరుగులు చేశారు. భారత పేసర్ ఆకాశ్ దీప్ (6/99) ఇంగ్లిష్ జట్టు పతనాన్ని శాసించాడు. ఆకాశ్ దీప్ అద్భుతమైన బౌలింగ్ ముందు వాళ్లు తలొంచారు. మొత్తంగా 68.1 ఓవర్లలో ఇంగ్లాండ్ 271 పరుగులు చేసి ఆలౌట్ అయింది. టీమిండియా ఎడ్జ్‌బాస్టన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఏకంగా 336 పరుగుల భారీ తేడాతో ఈ విజయం సాధించింది. టీమిండియా బౌలర్లలో ఆకాశ్ దీప్ 6 వికెట్లు, సిరాజ్, ప్రసిద్ కృష్ణ, జడేజా, సుందర్ తలో వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో కొత్త కెప్టెన్‌కు తొలి విజయం దక్కింది.
ఈ మ్యాచ్‌లో ఏం జరిగిందంటే..?
జూలై 2న ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకున్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌కు దిగిన భారత్ ఏకంగా 587 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ గిల్ 387 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్సులతో 269 పరుగులు సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే ఓపెనర్ యశస్వి జైస్వాల్ 87, రవీంద్ర జడేజా 89, వాషింగ్టన్ సుందర్ 42 పరుగులతో టీమిండియాకు పెద్ద స్కోర్ అందించడంతో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత టీమిండియా ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో గట్టి జవాబే ఇచ్చింది. కేవలం 84 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన తర్వాత కూడా హ్యారీ బ్రూక్(158), జేమీ స్మిత్ (184) పోరాటంతో 407 పరుగులు చేసి ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో సిరాజ్ బుమ్రా లేని లేటు పూడుస్తూ 6 వికెట్లతో చెలరేగిపోయాడు. అలాగే ఆకాశ్ దీప్ సైతం 4 వికెట్లు పడగొట్టాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com