Fencing: ఫెన్సింగ్ లో మెరిసిన భారత్... పతకం కైవసం చేసుకున్న భవానీదేవి

Fencing: ఫెన్సింగ్ లో మెరిసిన భారత్... పతకం కైవసం చేసుకున్న భవానీదేవి
జపాన్ నం.1 ఎమురైని మట్టికపిరించిన చెన్నై చిన్నది

ఫెన్సింగ్ క్రీడలో భారత క్రీడాకారిణి భవానిదేవీ చరిత్ర లిఖించింది. ఆసియన్ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో వరల్డ్ నంబర్ 1 క్రీడాకారిణి, జపాన్‌కి చెందిన మిసాకి ఎమురాని ఓడించిన మొదటి భారత క్రీడాకారిణిగా నిలిచింది. టోర్నీలో కాంస్య పతాకాన్ని గెలిచింది. ఆసియా గేమ్స్, ఒలంపిక్స్‌లో సత్తా చాటాలనుకుంటోంది.

29 సంవత్సరాల పభవాని స్వస్థలం చెన్నై నగరానికి చెందిన క్రీడాకారిణి. 2018 లో జరిగిన కామన్‌వెల్త్ ఫెన్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించి, ఆ ఘనత సాధించిన మొదటి భారత క్రీడాకారిణిగా నిలిచింది. త్రీ సంవత్సరాల క్రితం టోక్యో ఒలంపిక్స్‌కి అర్హత సాధించి, ఫెన్సింగ్‌లో ఈ మైలురాయిని దాటిన మొదటి భారత క్రీడాకారిణిగా రికార్డ్ సృష్టించింది.


ఒక న్యూస్ వెబ్‌సైట్‌కి తను ఇంటర్వూ ఇచ్చింది. ఫెన్సింగ్ క్రీడను తాను ఎంచుకోవడానికి తాను పడ్డ కష్టాలు పంచుకుంది.

కాంస్య పతకంపై స్పందిస్తూ.. ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణిని ఓడించడం అంత సులభం కాదు. ముఖ్యంగా ఫెన్సింగ్‌కి అంతగా ప్రాధాన్యం లేని మన దేశం నుంచి వచ్చిన క్రీడాకారిణులకి అది దాదాపు అసాధ్యమనే చెప్పాలి. చైనా, జపాన్‌లు ఈ క్రీడాలో ముందునున్నారు. ఈ విజయం భారత ఫెన్సింగ్ క్రీడని ముందుకు తీసుకెళ్తుంది. ఈ పతకం చాలా విలువైంది. దీని కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం అని అన్నారు.

తన కుటుంబం ఎప్పుడూ అండగా నిలిచిందన్నారు. నువ్వు ఆడపిల్లవి, ఈ ఆట ఎందుకు ఆడుతున్నావంటూ అడగలేదన్నారు. వారి మద్దతు లేకుంలే ఇన్ని ఘనతలు సాధించేదాన్ని కాదు. కానీ ఈ ప్రశ్నలన్నీ మీడియా, బంధువుల నుంచి ఎదురయ్యాయన్నారు.


ప్రభుత్వ సాయంతో నడిచే పాఠశాలలో చదువుకునేటప్పుడే ఏదైనా ఆటను ఎంపిక చేసుకోమని అడిగినప్పుడు ఫెన్సింగ్ ఎంచుకున్నాను. ఈ ఆట ఫెన్సింగ్ కొత్తగా, ఆనందంగా అనిపించింది. ఇక ఇందులోనే కొనసాగాలని నిర్ణయించుకున్నాను అని తెలిపింది.

ఈ క్రీడలో నాకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఫెన్సింగ్ ఖరీదైన క్రీడ. దేశీయ, అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొనడానికి, ఫెన్సింగ్‌ సామాగ్రికి, టోర్నీ ఫీజులకు ప్రభుత్వం లేదా ఇతర సంస్థలు సాయం చేయలేదు. కుటుంబం ఇచ్చిన మద్దతుతోనే నేను ఇంత దూరం వచ్చానన్నారు.


ఇండియాకు ఫెన్సింగ్‌లో పతకం వస్తుందా అని అడగ్గా.. ఒలంపిక్స్‌లో ఏదైనా సాధ్యమే. ఆటగాళ్లు పతకం గెలవడానికి అన్ని రకాలుగా సిద్ధమవుతారు. పారిస్ ఒలంపిక్స్‌లో పతకం గెలవడానికి నేను శాయశక్తులా కృషిచేస్తానన్నారు.

మనదేశంలో ఫెన్సింగ్‌కి ప్రాముఖ్యం తక్కువే. ఇంకా ఆరంభదశలోనే ఉంది. కానీ దీని అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తానన్నారు. ముందుగా చిన్న చిన్న లక్ష్యాల్ని చేరుతూ, పెద్ద లక్ష్యాల్ని ఛేదింగలమన్నారు.



Tags

Read MoreRead Less
Next Story