మరికాసేపట్లో వధూవరులుగా మారనున్న లవ్ బర్డ్స్.. !

ఇన్ని రోజులు ప్రేమికులుగా ఉన్న తమిళ హీరో విష్ణు విశాల్, భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల మరికాసేపట్లో మూడుముళ్ల బంధంతో ఒకటి కానున్నారు. నేడు (ఏప్రిల్ 22)న వీరి వివాహం జరగనుంది. ఈ క్రమంలో గత రాత్రి మెహందీ ఫంక్షన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అతికొద్ది మంది సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఇక మెహందీ వేడుకలో గుత్తా జ్వాల పసుపు రంగు లెహంగాలో మెరిసిపోగా, బ్లాక్ కుర్తాలో విష్ణు విశాల్ సందడి చేశారు.
దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరోనా నేపధ్యంలో జరుగుతున్న పెళ్లి కావడంతో కొద్దిమంది బంధుమిత్రుల మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది. ఇదిలావుండగా విష్ణు, జ్వాలకి ఇది రెండో వివాహం అన్న సంగతి తెలిసిందే. భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌ను 2005లో వివాహం చేసుకున్న జ్వాల 2011లో అతనితో విడాకులు తీసుకోగా, 2010లో రజనీ నటరాజన్‌ను పెళ్లి చేసుకున్న విష్ణు విశాల్ 2018లో ఆమెతో విడాకులు తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com