ICC: ఆ మ్యాచ్‌పై ఐసీసీ అవినీతి నిరోధక విభాగం కన్ను

ICC: ఆ మ్యాచ్‌పై ఐసీసీ అవినీతి నిరోధక విభాగం కన్ను
X
టీ20 ప్ర­పంచ కప్ ము­గి­సి నె­ల­న్నర రో­జు­లు గడి­చిన తర్వాత విచారణ

టీ20 ప్ర­పంచ కప్ ము­గి­సి నె­ల­న్నర రో­జు­లు గడి­చిన తర్వాత, గ్రూ­ప్ స్టే­జ్‌­లో జరి­గిన కె­న­డా - న్యూ­జి­లాం­డ్ మ్యా­చ్‌­పై ఇప్పు­డు ఐసీ­సీ అవి­నీ­తి ని­రో­ధక యూ­ని­ట్ (ACU) దృ­ష్టి సా­రిం­చిం­ది. చె­పా­క్ వే­ది­క­గా జరి­గిన ఈ మ్యా­చ్‌­లో కె­న­డా క్రి­కె­ట్ బో­ర్డు ఫి­క్సిం­గ్‌­కు పా­ల్ప­డిం­దం­టూ ‘ది ఫి­ఫ్త్ ఎస్టే­ట్’ అనే ఇన్వె­స్టి­గే­టి­వ్ డా­క్యు­మెం­ట­రీ సం­చ­లన ఆరో­ప­ణ­లు చే­సిం­ది. దీ­ని­పై స్పం­దిం­చిన ఐసీ­సీ, రెం­డు ప్ర­త్యేక బృం­దా­ల­తో వి­చా­ర­ణ­ను ప్రా­రం­భిం­చిం­ది. సూ­ప­ర్-8 రే­సు­లో ని­ల­వ­డా­ని­కి కీ­ల­కం­గా మా­రిన ఈ పో­రు­లో జరి­గిన కొ­న్ని పరి­ణా­మా­లు అను­మా­నా­స్ప­దం­గా ఉన్నా­య­ని ఐసీ­సీ వర్గా­లు భా­వి­స్తు­న్నా­యి. ప్ర­ధా­నం­గా కె­న­డా కె­ప్టె­న్ ది­ల్ప్రీ­త్ బజ్వా వే­సిన ఐదో ఓవ­ర్‌­పై ఈ ఆరో­ప­ణ­లు వె­ల్లు­వె­త్తా­యి.

టో­ర్నీ­కి కే­వ­లం మూడు వా­రాల ముం­దే సా­ర­థి­గా బా­ధ్య­త­లు చే­ప­ట్టిన బజ్వా, ఆ ఓవ­ర్‌­లో ధా­రా­ళం­గా 15 పరు­గు­లు సమ­ర్పిం­చు­కు­న్నా­డు. అం­త­కు­ముం­దు 35/2 స్కో­రు­తో నె­మ్మ­ది­గా ఉన్న కి­వీ­స్ ఇన్నిం­గ్స్, ఆ ఓవ­ర్‌­తో ఒక్క­సా­రి­గా వేగం పుం­జు­కు­ని మ్యా­చ్ స్వ­రూ­పా­న్నే మా­ర్చే­సిం­ది. ఈ క్ర­మం­లో­నే కె­న­డా క్రి­కె­ట్ బో­ర్డు సభ్యు­లు, జట్టు ఎం­పి­క­లో కీలక పా­త్ర పో­షిం­చిన మాజీ కోచ్ ఖు­ర్ర­మ్ చో­హా­న్ ప్ర­మే­యం­పై కూడా వి­చా­రణ జరు­పు­తు­న్నా­రు. ని­ర్ది­ష్ట ఆట­గా­ళ్ల­ను మా­త్ర­మే జట్టు­లో­కి తీ­సు­కో­వా­ల­ని ఆయన ఒత్తి­డి తె­చ్చి­న­ట్లు సమా­చా­రం. ఈ మ్యా­చ్‌­లో తొ­లుత బ్యా­టిం­గ్ చే­సిన కె­న­డా, ఓపె­న­ర్ యు­వ­రా­జ్ సమ్రా (110) సెం­చ­రీ­తో 173/4 పరు­గు­లు చే­సిం­ది. అనం­త­రం న్యూ­జి­లాం­డ్ కే­వ­లం 15.1 ఓవ­ర్ల­లో­నే లక్ష్యా­న్ని ఛే­దిం­చి ఘన­వి­జ­యం సా­ధిం­చిం­ది. ఐసీ­సీ తా­త్కా­లిక జీఎం ఆం­డ్రూ ఎఫ్ గ్రే­వ్ స్పం­ది­స్తూ, ఇలాం­టి ఆరో­ప­ణ­ల­పై ఇప్పు­డే తుది ని­ర్ణ­యా­ని­కి రా­లే­మ­ని, ఏసీ­యూ వి­చా­రణ పూ­ర్త­యిన తర్వా­తే వా­స్త­వా­లు వె­లు­గు­లో­కి వస్తా­య­ని తె­లి­పా­రు.

Tags

Next Story