ఐపీఎల్ కొత్త రూల్.. బ్యాట్స్‌మెన్‌కు అడ్వాంటేజ్.. బౌలర్లకు చుక్కలే...!

IPL 2021 Phase 2:ధానధన్ ఫ్మార్మాట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2021 రెండో దశ మ్యాచులకు అన్ని ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇప్పటికే రెండో దశ లీగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. ఐపీఎల్ సీజన్ 14 కరోనా కారణంగా ఆర్థంతరంగా వాయిదా పడింది. దాంతో ఐపీఎల్ మ్యాచులు తిరిగి సెప్టెంబర్ నుంచి ప్రారంభించాలని బీసీసీఐ భావించింది. యూఏఈ వేదికగా మిగిలిన 31 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో క్రికెటర్ల రక్షణను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. రెండో దశ ఐపీఎల్ కోసం ఎవరైనా ఆటగాడు బంతిని స్టాండ్‌లోకి సిక్స్‌గా బాదితే.. ఆ బంతిని తిరిగి ఉపయోగించవద్దనే రూల్ తీసుకొచ్చింది.
బీసీసీఐ తాజాగా 41 పేజీలతో కూడిన బయో బబుల్ ప్రొటోకాల్స్‌ను విడుదల చేసింది. ఓ ఇంగ్లీషు వెబ్ సైట్ కథనం ప్రకారం.., బ్యాట్స్ మెన్ బంతిని స్టాండ్‌లోకి సిక్స్‌గా బాదితే.. ఆ బంతిని తిరిగి ఉపయోగించరు. కొత్త బంతిని తీసుకొస్తారు. ప్లేయర్లు బంతిని స్టాండ్స్ అవతలకు కొడితే.. ఆ బంతిని ఇతరులు పట్టుకునే అవకాశం ఉన్నందున దానిని తిరిగి వాడితే ఆటగాళ్లకు కరోనా సోకే ప్రమాదం ఉంది. బంతిని పూర్తిగా శుభ్రపరిచిన తర్వాత బాల్ లైబ్రరీలో దాచనున్నారు. ఈసారి మ్యాచులకు ప్రేక్షకులను అనుమతిస్తున్నందున ఈ కొత్త రూల్స్ అందుబాటులోకి తెచ్చినట్లు తెలుస్తుంది. అయితే ప్రతిసారి ఇలా బాల్ మారిస్తే బౌలర్లకు ఇబ్బందులు తలేత్తే అవకాశం ఉంది. కొత్త బాల్ గ్రీప్ దొరకడం కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా స్పిన్నర్లలకు బంతిపై పట్టుచిక్కకుండా పోతుంది. దీంతొ ఇబ్బందులు ఎదురైయ్యే అవకాశం ఉంది. స్టాండ్స్‌లో పడిన బంతి స్థానంలో కొత్త బంతిని తీసుకొస్తే బ్యాట్స్‌మెన్‌కు అడ్వాంటేజ్‌గా మారనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com