IPL 2023 : హైదరాబాద్ లో ఐపీఎల్ ఫివర్

ఐపీఎల్ ఫివర్ హైదరాబాద్‌ను తాకింది. మూడేళ్ల తరువాత ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుందడంతో సందడి నెలకొంది. మ్యాచ్‌ను తిలకించేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. మరోవైపు మ్యాచ్ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 15వందల మంది పోలీసులతో పహారా కాస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఇక బ్లాక్ టికెట్లపై కూడా నిఘా పెట్టినట్లు పోలీసులు తెలిపారు.
మ్యాచ్ నేపథ్యంలో అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ముందస్తు చర్యలు చేపట్టింది. అభిమానులు గ్రౌండ్‌కు వచ్చేందుకు ప్రత్యేక సర్వీసులను నడుపుతుంది. మరోవైపు మెట్రో కూడా సేవలందిస్తుంది. ప్రతీ రెండు, మూడు నిమిషాలకు ఓ సర్వీసు చొప్పున నడుపుతుంది. దీంతో అభిమానులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక తొలి మ్యాచ్‌లో గెలిచి సత్తా చాటాలని సైన్ రైజర్స్ చూస్తుంది. కెప్టెన్ మర్కారమ్ ఇంకా టీంతో జైన్ కాకపోవడంతో తాత్కాలికంగా భువనేశ్వర్ బాధ్యతలు చేపట్టనున్నాడు. తొలి మ్యాచ్ సొంత గ్రౌండ్‌లో జరుగుతుండటం హైదరాబాద్ టీమ్‌కు కలిసొచ్చే అంశం. ఇక స్వదేశీ, విదేశీ బ్యాటింగ్ లైనప్ సమతూకంగా సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఉంది. అటు రాజస్థాన్ టీమ్ కూడా అద్భతంగానే ఉంది. సంజూ సామ్‌సన్ ఆధ్వర్యంలో పేపర్ పై పటిష్టంగా కన్పిస్తోంది. మొత్తానికి ఇరు జట్లు మధ్య పోరు హోరా హోరీగా సాగుతుందని క్రికెట్ పండితులు చెబుతున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో పరుగుల వదర పారడం ఖాయంగా కన్పిస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com