IPL 2024 : హైదరాబాద్‌కు తప్పని ఓటమి..చెన్నై విజయం
చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమిపాలైంది.ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. చెపాక్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 213 పరుగుల లక్ష్య ఛేదనలో హైదరాబాద్ 134 పరుగులకే చేతులేత్తేసింది. సన్‌రైజర్స్ బ్యాట్స్‌మన్ ఐడెన్ మార్‌క్రమ్ (32) ఒక్కడే టాప్ స్కోరు నమోదు చేశాడు.
మిగతా ఆటగాళ్లలో హెన్రిచ్ క్లాసెస్ (20), అబ్దుల్ సమద్ (19), నితీస్ కుమార్ రెడ్డి (15), అభిషేక్ శర్మ (15), ట్రానిస్ హెడ్ (13) పరుగులకే పరిమితం కాగా.. షాబాజ్ అహ్మద్ (7), పాట్ కమిన్స్ (5), భువనేశ్వర్ కుమార్ (4), జయదేవ్ ఉనద్కత్ (1) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 18.5 ఓవర్లలో 134 పరుగులకే హైదరాబాద్ ఆలౌట్ అయింది. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే 4 వికెట్లు తీయగా, ముస్తాఫిజుర్ రెహమాన్ రెండు వికెట్లు, మతీష పతిరన రెండు వికెట్లు, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసుకున్నారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టు హైదరాబాద్‌కు 213 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. చెన్నై బ్యాట్స్‌మన్ రుతురాత్ గైక్వాడ్ (98; 54 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్) హాఫ్ సెంచరీతో విజృంభించగా, డారిల్ మిచెల్ (52; 32 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో రాణించాడు. మిగతా ఆటగాళ్లలో అజింక్య రహానే(9) పరుగులకే పెవిలియన్ చేరగా, శివం దూబే (39 నాటౌట్), ఎంఎస్ ధోనీ (5 నాటౌట్) పరుగులతో అజేయంగా నిలిచారు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, టి.నటరాజన్, జయదేవ్ ఉనద్కత్ తలో వికెట్ తీసుకున్నారు. చెన్నై కెప్టెన్ రుతురాజ్ (98/54)పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన 9 మ్యాచ్‌ల్లో 5 గెలిచి 4 ఓడి మొత్తం 10 పాయింట్లతో 3వ స్థానంలో కొనసాగుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడిన 9 మ్యాచ్‌ల్లో 5 గెలిచి 4 ఓడి మొత్తం 10 పాయింట్లతో 4వ స్థానంలో కొనసాగుతోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com