IPL2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది

IPL2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది
X
మార్చి 22 నుంచి మహా సమరం ఆరంభం.. ఈసారి హైదరాబాద్ లో 9 మ్యాచులు

క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2025 షెడ్యూల్ విడుదలైంది. మార్చి 22న ప్రారంభమై.. 65 రోజుల పాటు మ్యాచ్లు కొనసాగనున్నాయి. తొలి మ్యాచ్ కేకేఆర్, ఆర్సీబీ మధ్య ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది. మొత్తం 13 వేదికల్లో 74 మ్యాచ్లు జరగనున్నాయి. మే 25న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ 18వ సీజన్‌ మార్చి 22 నుంచి ఆరంభమై మే 25న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఇందులో భాగంగా 65 రోజుల పాటు దేశంలోని 13 నగరాల్లో మొత్తంగా 74 మ్యాచ్‌లు జరుగనున్నాయి. షెడ్యూల్‌లో 12 డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లున్నాయి. ఎప్పటిలాగే వైజాగ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌, ధర్మశాలను పంజాబ్‌ కింగ్స్‌, గువాహటిని రాజస్థాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైజీలు తమ రెండో హోమ్‌ గ్రౌండ్‌గా ఎంచుకున్నాయి. దీంతో ఆయా వేదికల్లో రెండేసి మ్యాచ్‌లు జరుగనుండగా, ధర్మశాల మాత్రం మూడు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. వైజాగ్‌లో మార్చి 24న లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌, 30న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఢిల్లీ జట్టు తలపడుతుంది.

సన్ రైజర్స్ మ్యాచ్‌లు ఇవే..

ఐపీఎల్‌ 2025 మ్యాచ్‌లు మార్చి 22 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ తొలి మ్యాచ్‌ను రాజస్థాన్‌తో మార్చి 23న ఆడనుంది. ఆ తర్వాత మార్చి 27న లక్నో, మార్చి 30న ఢిల్లీ, ఏప్రిల్‌ 3న కోల్‌కతా, ఏప్రిల్‌ 6న గుజరాత్‌, 12న పంజాబ్‌, 17న ముంబయి, 23న ముంబయి, 25న చెన్నై, మే 2న గుజరాత్‌, 5న ఢిల్లీ, 10న కోల్‌కతా, 13న బెంగళూరు, మే 18న లక్నోతో ఆడనుంది.

ఉప్పల్లో 9 వైజాగ్ లో 2

గతేడాది ఉప్పల్‌ మైదానం ఏడు లీగ్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వగా.. ఈసారి ఆ సంఖ్య పెరిగింది. ఎందుకంటే ప్లేఆఫ్స్ లో భాగంగా క్వాలిఫయర్‌ 1, ఎలిమినేటర్‌ మ్యాచ్‌లు కూడా ఈసారి హైదరబాద్ లో జరగనున్నాయి. దీంతో హైదరాబాద్‌లో జరిగే మొత్తం మ్యాచ్‌ల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. ఇక మార్చి 23న ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ జట్టు రాజస్థాన్‌ రాయల్స్‌తో తమ ఆరంభ మ్యాచ్‌ను ఆడనుంది. అలాగే క్వాలిఫయర్‌ 2, ఫైనల్‌ మ్యాచ్‌లకు కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదిక కానుంది. వైజాగ్ లో రెండు మ్యాచులు జరగనున్నాయి.

Tags

Next Story