IPL:ప్రాక్టీస్ మొదలుపెట్టిన షమీ

IPL:ప్రాక్టీస్ మొదలుపెట్టిన షమీ
X
సన్ రైజర్స్ జెర్సీతో మెరిసిపోయిన షమీ... ఉప్పల్ స్టేడియం అధికారుల కీలక విజ్ఞప్తి

క్రికెట్ అభిమానులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2025 సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ జెర్సీ ధరించి టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఐపీఎల్ మెగా వేలంలో షమీని హైదరాబాద్ రూ.10 కోట్లకు దక్కించుకుంది. ఇప్పటికే ఉప్పల్ మైదానంలో మహ్మద్ షమీ ప్రాక్టీస్ సైతం మొదలు పెట్టారు.

ఉప్పల్ స్టేడియానికి ఇవి తీసుకురావొద్దు

ఉప్పల్ స్టేడియంలో ఈసారి ఐపీఎల్ చూసేందుకు క్రికెట్ అభిమానులు సిద్ధమైపోయారు. ఈ నేపథ్యంలో అధికారులు.. అభిమానులకు కీలక విజ్ఞప్తి చేశారు. కెమెరాలు & రికార్డింగ్ పరికరాలు, హెడ్‌ఫోన్స్ & ఎయిర్‌పాడ్స్ , సిగరెట్, అగ్గిపెట్టె, కత్తులు, గన్స్, వాటర్, మద్యం , పెట్స్, టపాసులు, తినుబండారాలు, బ్యాగులు, ల్యాప్‌టాప్‌లు, సెల్ఫీ స్టిక్స్, హెల్మెట్, బైనాక్యులర్ తీసుకురావద్దని సూచించారు.

ఐపీఎల్ ప్రారంభ వేడుకకు బాలీవుడ్ స్టార్లు

ఐపీఎల్ 18వ సీజన్‌ ఈ నెల 22న ప్రారంభం కానుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ప్రారంభోత్సవ వేడుక జరగనుంది. ఈ ఈవెంట్‌లో బాలీవుడ్‌ స్టార్లు మెరవనున్నట్లు సమాచారం. బాలీవుడ్ నుంచి షారుఖ్‌ ఖాన్, సల్మాన్, విక్కీ కౌశల్, సంజయ్ దత్ వచ్చే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అరిజిత్‌ సింగ్‌, శ్రేయా ఘోషల్‌ సంగీత ప్రదర్శన, శ్రద్ధా కపూర్, వరుణ్‌

రజత్‌ పటీదార్‌ ఎదుగుతాడు: ఉతప్ప

ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు రజత్‌ పటీదార్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ నేపథ్యంలో విరాట్‌ కోహ్లీ నుంచి నాయకత్వ లక్షణాలను పటీదార్‌ ఆకళింపు చేసుకునే అద్భుత అవకాశం ఉందని భారత మాజీ క్రికెటర్‌ రాబిన్ ఉతప్ప అన్నారు. ఐపీఎల్ లో కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించడం రజత్‌ పటీదార్‌ ఇదే మొదటిసారి. మరో వైపు అక్షర్‌ పటేల్‌ కూడా మొదటిసారి దిల్లీ క్యాపిటల్స్‌ కు సారథిగా వ్యవహరించనున్నాడు.

Tags

Next Story