IPL: పంజాబ్‌పై బెంగళూరు విజయం

ఐపీఎల్ 18 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐదో విజయం అందుకుంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని బెంగళూరు 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఒకపక్క విరాట్.. మరోపక్క దేవ్‌దత్..
దేవ్‌దత్ పడిక్కల్ (61; 35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), విరాట్ కోహ్లీ (73*; 54 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో మెరిశారు. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (1)ని అర్ష్‌దీప్ ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే ఔట్ చేయగా కోహ్లీ, పడిక్కల్ నిలకడగా ఆడి జట్టును విజయం దిశగా నడిపించారు. 30 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న పడిక్కల్‌ను హర్‌ప్రీత్ వెనక్కి పంపాడు. దీంతో 66 బంతుల్లో 103 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. నెమ్మదిగా ఆడిన కోహ్లీ 43 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. రజత్ పటీదార్ (12)ని 17 ఓవర్‌లో చాహల్ ఔట్ చేశాడు. అప్పటికే బెంగళూరు విజయానికి చేరువగా.. జితేశ్, కోహ్లీ మిగతా పని పూర్తి చేశారు. ఎనిమిది మ్యాచ్‌ల్లో పంజాబ్‌కు ఇది మూడో ఓటమి.
ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చినా..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (22; 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), సిమ్రన్ సింగ్ (33; 17 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) శుభారంభం అందించారు. కానీ, మిగతా బ్యాటర్లు భారీ స్కోర్లు చేయకపోవడంతో ఆ జట్టు మోస్తరు స్కోరుకే పరిమితమైంది. జోష్ ఇంగ్లిస్ (29; 17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), శశాంక్ సింగ్ (31*; 33 బంతుల్లో), మార్కో యాన్సెన్ (25*; 20 బంతుల్లో) ఫర్వాలేదనిపించారు. నేహల్ వధేరా (5), స్టాయినిస్ (1) నిరాశపర్చారు. ఆర్సీబీ బౌలర్లలో సుయాశ్ శర్మ 2, కృనాల్ పాండ్య 2, రొమారియో ఫెఫర్డ్ ఒక వికెట్ తీశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com