IPL: అదరగొట్టిన బెంగళూరు

ఐపీఎల్ ఆరంభ మ్యాచులో బెంగళూరు మెరిసింది. విరాట్, ఫిల్ సాల్ట్ ఊచకోతతో ఘన విజయం సాధించింది. కేకేఆర్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ ప్రారంభం నుంచి దూకుడు ప్రదర్శించింది. సాల్ట్, కోహ్లీ లు హాఫ్ సెంచరీలతో కేకేఆర్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. 22 బాల్స్ మిగిలి ఉండగానే ఆర్సీబీ లక్ష్యాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు 20 ఓవర్లు పూర్తి అయ్యేసరికి ఎనిమిది వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. KKR బ్యాటర్లలో రింకూసింగ్ 12, రస్సెల్ 4, డీకాక్ 4, నరైన్ 44, రహానే 56, వెంకటేశ్ అయ్యర్ 6 పరుగులు చేశారు.
విరాట్ విశ్వరూపం
175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు అదిరే ఆరంభం దక్కింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 174 పరుగలు చేసింది. అజింక్య రహానే కెప్టెన్ ఇన్నింగ్స్ (56) తో రాణించాడు. కృనాల్ పాండ్యా మూడు వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం ఆర్సీబీ ఛేజింగ్ ను 16.2 ఓవర్లలోనే మూడు వికెట్లకు 177 పరుగులు పూర్తి చేసి విజయం సాధించింది. విరాట్ కోహ్లీ (36 బంతుల్లో 59 నాటౌట్, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ ఫిఫ్టీ చేసి జట్టును విజయం వైపు నడిపించాడు. ఫిల్ సాల్ట్ (31 బంతుల్లో 56,0 9 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర ఫిఫ్టీతో సత్తా చాటాడు. కోల్‌కత్తా బౌలర్లలో సునీల్ నరైన్ (1-27) పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఈ విజయంతో ఆడిన తొలి మ్యాచ్ లోనూ ఆర్సీబీ విజయం సాధించింది. ఇక డిఫెండింగ్ చాంపియన్స్ గా బరిలోకి దిగిన కేకేఆర్ కు భారీ షాక్ తగిలింది.
రహానే ఒక్కడే...
ఆర్సీబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా.. డికాక్, రహానెలు కోల్‌కతా ఇన్నింగ్స్‌ను మొదలెట్టారు. ఆరంభంలో ఆట గొప్పగా ఏమీ లేదు. తొలి ఓవర్లోనే డికాక్ అవుటయ్యాడు. 3 ఓవర్లలో కోల్‌కత్తా కేవలం 9 పరుగులు చేసి ఒక వికెట్ కూడా కోల్పోయింది. ఆ తర్వాత కళ్లు చెదిరే షాట్లతో చెలరేగిన రహానె చెలరేగిపోయాడు. సలామ్ ఓవర్లో రెండు ఫోర్లు, సిక్స్‌తో ఇన్నింగ్స్‌కు ఊపుతెచ్చాడు. రెండు ఫోర్లు, సిక్స్‌తో యశ్ దయాల్‌నూ శిక్షించాడు. మరోవైపు నరైన్ కూడా ఫోర్లు, సిక్స్‌లు దంచేయడంతో ఆర్సీబీ బౌలర్లకు దిక్కుతోచలేదు. వీరిద్దరి దూకుడుతో కోల్‌కత్తా 9 ఓవర్లకు స్కోరు 96/1 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. కోల్‌కతా స్కోరు 200 దాటడం కష్టం కాదనిపించింది. కానీ బలమైన పునాది పడ్డా.. కోల్‌కతా అనూహ్యంగా తడబడింది. నరైన్, రహానెలను రసిఖ్, కృనాల్ వరుస ఓవర్లలో ఔట్ చేయడంతో ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది. వెంకటేశ్ అయ్యర్ (6), రింకు సింగ్ (12), రసెల్ (4) కూడా విఫలమయ్యారు. లను తన వరుస ఓవర్లలో ఔట్ చేయడం ద్వారా కృనాల్ ఆ జట్టు వెన్నువిరిచాడు. రఘువంశీ 30; పరుగులతో కాస్త రాణించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com