IPL: బెంగళూరు విజయగర్జన

ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో అద్భుత విజయాన్నందుకుంది. ముంబై ఇండియన్స్‌తో వాంఖడే వేదికగా ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. కీలక సమయంలో భువనేశ్వర్ కుమార్, జోష్ హజెల్ వుడ్, కృనాల్ పాండ్యా(4/45) అద్భుత బౌలింగ్‌తో ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ గెలుపుతో వాంఖడేలో ఆర్‌సీబీ 10 ఏళ్ల తర్వాత విజయం సాధించింది. 10 ఏళ్ల తర్వాత అంటే 3620 రోజుల వాంఖడేలో బెంగళూరు టీం అద్భుత విజయం సాధించి, పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి చేరుకుంది.
కోహ్లీ, రజత్ మెరుపుల్
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీకి ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్(4)ను తొలి ఓవర్‌లోనే ట్రెంట్ బౌల్ట్ క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి వచ్చిన పడిక్కల్ తొలి బంతినే బౌండరీగా తరలించాడు. కోహ్లీ కూడా బౌండరీలతో విరుచుకుపడటంతో ఆర్‌సీబీ స్కోర్ బోర్డు పరుగెత్తింది. ఆర్‌సీబీ పవర్ ప్లేలోనే వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 67), రజత్ పటీదార్(32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దేవదత్ పడిక్కల్(22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37), జితేశ్ శర్మ(18 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 40 నాటౌట్) దూకుడుగా ఆడారు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 222 పరుగుల భారీ స్కోరు చేసి ముంబైకు సవాల్ విసిరింది.
లక్ష్య ఛేదనలో పోరాడినా..
అనంతరం 222 పరుగుల లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్‌కు శుభారంభం దక్కలేదు. దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ శర్మ(17).. యశ్ దయాల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్(17)ను హజెల్ వుడ్ పెవిలియన్ చేర్చాడు. విల్ జాక్స్(28) సాయంతో సూర్యకుమార్ యాదవ్(28) దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. పవర్ ప్లేలో ముంబై 2 వికెట్లకు 54 పరుగులు చేసేంది. ఆఖరి ఓవర్‌లో ముంబై విజయానికి 19 పరుగులు అవసరమవ్వగా.. కృనాల్ పాండ్యా కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి బెంగళూరును గెలిపించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com