IPL: కామెరూన్‌ గ్రీన్‌కు రూ.25.20 కోట్లు

IPL: కామెరూన్‌ గ్రీన్‌కు రూ.25.20 కోట్లు
X
ఆసీస్ ఆల్‌రౌండర్‌ గ్రీన్‌కు భారీ ధర... గ్రీన్‌ను దక్కించుకున్న కోల్‌కత్తా.. మతీషా పతిరాణకు రూ.18 కోట్లు

ఐపీఎల్ మినీ వేలంలో ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ కామెరాన్ గ్రీన్ అత్యంత ధరకు అమ్ముడుపోయాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు అతన్ని రూ. 25.20 కోట్లకు కొనుగోలు చేసింది. . ఐపీఎల్‌లో అత్యధిక ధర పలికిన విదేశీ ప్లేయర్‌గా గ్రీన్‌ రికార్డు సృష్టించాడు. అంతకుముందు 2024లో మిచెల్‌ స్టార్క్‌ను కేకేఆర్ రూ. 24.75 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ రికార్డును గ్రీన్ తిరగరాశాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌ చరిత్రలో కామెరూన్‌ గ్రీన్‌ది మూడో అత్యధిక ధర. రిషభ్‌ పంత్ (రూ.27 కోట్లు, LSG), శ్రేయస్ అయ్యర్ (రూ.26.75 కోట్లు, పంజాబ్ కింగ్స్) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

బేస్‌ప్రైస్‌‌కే అమ్ముడుపోయిన స్టార్ ప్లేయర్

ఐపీఎల్‌ 2026 మినీ వేలంలో మూడో సెట్‌ (వికెట్‌ కీపర్లు) వేలం జరిగింది. బెన్‌ డకెట్‌ను బేస్‌ప్రైస్‌ రూ. 2 కోట్లకు ఢిల్లీ, ఫిన్‌ లెన్‌ను బ్రేస్‌ ప్రైస్‌ రూ.2 కోట్లకు కోల్‌కతా, డికాక్‌ను బేస్‌ప్రైస్‌ రూ. కోటికే ముంబై సొంతం చేసుకున్నాయి. జేమీ స్మిత్‌, బెయిర్‌స్టో, గుర్బాజ్‌, కేఎస్‌ భరత్‌ అన్‌సోల్డ్‌గా మిగిలారు.

ఆర్సీబీలోకి సూపర్ హిట్టర్

ఐపీఎల్‌ 2026 మినీ వేలంలో ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌(బేస్‌ప్రైస్‌ రూ.2 కోట్లు)ను రూ.7 కోట్లకు బెంగళూరు కైవసం చేసుకుంది. రెండో సెట్‌(ఆల్‌రౌండర్‌)లో హసరంగను బేస్‌ప్రైస్‌ రూ. 2కోట్లకే లక్నో దక్కించుకుంది. బేస్‌ప్రైస్‌ రూ.2 కోట్లు ఉన్న అట్కిన్సన్‌, రచిన్‌ రవీంద్రతోపాటు లివింగ్‌స్టోన్‌, వియాన్‌ ముల్డర్‌, దీపక్‌ హుడాను తీసుకునేందుకు ఫ్రాంచైజీలు ముందుకురాకపోవడంతో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు.

ఈ ప్లేయర్స్ అన్ సోల్ట్

మొదటి సెట్ వేలంలో పృథ్వీషా, సర్ఫరాజ్‌ ఖాన్‌, కాన్వే, జేక్ ఫ్రెజర్ మెక్‌గుర్క్‌ UNSOLDగా మిగిలారు. డేంజరస్ సౌతాఫ్రికన్ బ్యాటర్ డేవిడ్‌ మిల్లర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ.2 కోట్లకు దక్కించుకుంది.

Tags

Next Story