IPL: ఛాంపియన్స్ వర్సెస్ కింగ్స్

IPL: ఛాంపియన్స్ వర్సెస్ కింగ్స్
X
నేడు క్వాలిఫయర్ 2, ముంబైతో పంజాబ్ ఢీ

టాటా ఐపీఎల్ సీజన్ 18 పూర్తికావడానికి మరో రెండు మ్యాచులు మాత్రమే మిగిలున్నాయి. తన చిరకాల కోరికను తీర్చుకునేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అందరి కంటే ఒక అడుగు ముందు నిలిచింది. వారితో తాడోపేడో తేల్చుకునేందుకు నేడు 6 సార్లు ఛాంపియన్ టీం ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ సీజన్ ఆరంభం నుంచి అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టిన పంజాబ్ కింగ్స్ తొలి క్వాలిఫయర్స్‌లో స్థానం దక్కించుకున్న దారుణంగా చతికిలపడింది. అయితే, ఇప్పటి వరకు టైటిల్ సాధించని పంజాబ్ ఆశలను ఛాంపియన్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తీరుస్తాడా? లేదా మరోసారి ముంబై అందరి ఆశలను గల్లంతు చేస్తూ అల్టిమేట్ ఛాంపియన్‌గా నిలుస్తుందా అనేదానికి నేటి మ్యాచ్ కీలకం కానుంది.

పంజాబ్ బలం, బలగమిదే

19 పాయింట్లతో లీగ్ దశలో టేబుల్ టాపర్స్‌గా నిలిచిన పంజాబ్ టైటిల్ సాధిస్తుంది అనే స్టేట్మెంట్ ఎవరిని పెద్దగా ఆశ్చర్యపరచదు. కానీ.. క్వాలిఫయర్ 1లో ఆర్సీబీపై ఆడిన జట్టును చూస్తే ఈ జట్టు ప్లే ఆఫ్స్‌కు ఎలా అర్హత సాధించిందనే అనుమానాలు కలగడం సహజం. కానీ స్పోర్ట్ ఈజ్ అల్ అబౌట్ బౌన్స్ బ్యాక్. ముఖ్యంగా టీ20ల్లో ఏ క్షణం ఏం జరుగుతుందో అసలు ఊహించలేము. ముఖ్యంగా పంజాబ్ జట్టులో ఈసారి అందరు ప్లేయర్లు మంచి ఇంటెంట్‌ని చూపిస్తున్నారు. ఏ ఒక్క ప్లేయర్‌పై పూర్తిగా ఆధారపడకపోవడమే పంజాబ్ బలగం యెక్క బలం. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య అటాకింగ్ అండ్ సెన్సిబుల్ ఆటతో గేమ్ ఛేంజర్లుగా మారారు. స్కిప్పర్ శ్రేయాస్ అయ్యర్ గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్‌లోనే ఉత్తమ కెప్టెన్ అనిపించుకున్నాడు. ఈ సీజన్‌లో కూడా కేవలం కెప్టెన్‌గానే కాకుండా ప్లేయర్ గాను అద్భుతమైన ఇంటెంట్‌ని చూపిస్తున్నాడు. జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్ జట్టుకు కచ్చితంగా కొండంత బలం. శశాంక్ సింగ్, నెహాల్ వధేరాలు మ్యాచ్ స్వభావాన్ని పూర్తిగా మార్చేయగలమని ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. ఇక బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్ మ్యాజిక్ కొనసాగుతూనే ఉంది. ఈ సీజన్‌లో చాహల్ పెద్దగా ప్రభావం చూపించకపోయిన అతనొక ఛాంపియన్ ప్లేయరని మరిచిపోకూడదు. జాన్సెన్, హర్‌ప్రీత్ బ్రార్ కొంచెం పరుగులు కట్టడి చేసి వికెట్లు పడగొడితే పంజాబ్‌కు పెద్ద మైనస్ పాయింట్లు ఉన్నట్లే కనిపించడం లేదు.2025 ఐపీఎల్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టే అని తేల్చి చెప్పాడు. అయితే ఈసారి ఆర్సీబీ కప్పు క1ట్టాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు.

ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్

ముంబై ఇండియన్స్.. ది మోస్ట్ డేంజరస్ ఐపీఎల్ టీం ఎవర్ ఎగ్జిస్ట్ అనడంలో ఎలాంటి సంశయం లేదు. వాస్తవానికి ఆదర్శవంతమైన క్రికెట్ టీం అంటే ముంబై ఇండియన్సే అని చెప్పుకోవాలేమో. ఆ టీం చూడని గెలుపులు లేవు, ఎదురుకున్న ఓటములు కూడా తక్కువేమి కాదు కానీ.. సమస్యలను వాళ్లు ఎదురుకున్న తీరు ఆ టీంని ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్‌గా మార్చింది. ఆ టీంలోని ప్రతి ఒక్క ప్లేయర్ ఛాంపియనే. టీంలోకి సాధారణ ప్లేయర్లుగా ఎంటరైన అనేక మంది ప్లేయర్లు ఇప్పుడు చాంపియన్లుగా వెలుగొందుతున్నారు. ఇక టీం బలాబలాలు విషయానికొస్తే ఓపెనర్లు రోహిత్ శర్మ, జానీ బెయిర్‌స్టో ఫామ్ చూసి కేవలం పంజాబే కాదు ఆర్సీబీ కూడా కంగారు పడుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. సూర్యకుమార్ సూపర్ ఇన్నింగ్స్‌లకు తోడుగా తిలక్ వర్మ కూడా ఫామ్‌లోకి రావడం వారిని అన్ స్టాపబుల్‌గా మారుస్తుంది. ఇక హార్దిక్ పాండ్య, నమన్ ధీర్‌లతో మిడిలార్డర్ దుర్బేధ్యంగా ఉంది. బౌలింగ్‌లోను బుమ్రా, బోల్ట్, మిచెల్ శాంట్నర్ అందరు ఛాంపియన్లే.

అశ్విన్ ప్రిడిక్షనా.. స్టెయిన్ జోస్యమా?

ఒకవైపు ఏ టీం గెలుస్తుందా అని అందరు టెన్షన్ వాతావరణంలో ఉంటే మాజీ క్రికెట్ దిగ్గజాలు తమ ప్రిడిక్షన్లతో అభిమానుల మధ్య మరింత టెన్షన్ పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెట్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై గెలిస్తే ఆర్సీబీ ఫైనల్ గెలవడం అసాధ్యం అన్నాడు. ఊహించినట్టే ముంబై.. గుజరాత్ టైటాన్స్‌పై అద్భుతమైన విజయం సాధించింది. అశ్విన్ ప్రిడిక్షన్ ప్రకారం నేడు ముంబై.. పంజాబ్‌ని ఓడించి, ఫైనల్‌లో ఆర్సీబీని మట్టి కురిపిస్తుంది. . మరోవైపు సౌతాఫ్రికన్ మాజీ దిగ్గజం స్టెయిన్ సైతం ఆసక్తికర ప్రిడిక్షన్స్‌తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు.

Tags

Next Story