IPL: బట్లర్ దంచెన్‌.. గుజరాత్‌ గెలిచెన్‌

IPL: బట్లర్ దంచెన్‌.. గుజరాత్‌ గెలిచెన్‌
X
బెంగళూరుకు తొలి షాక్.. అలవోక విజయం సాధించిన గుజరాత్‌...

ఐపీఎల్లో తొలి రెండు మ్యాచుల్లో గెలిచి ఊపు మీదున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ స్వంత మైదానం అయిన చిన్నస్వామి స్టేడియంలో తడబడింది. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఆర్‌సీబీని గుజరాత్‌ ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఆర్‌సీబీ విధించిన 170 పరుగుల లక్ష్యాన్ని జీటీ 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీపై గుజరాత్ టైటాన్స్‌ ఘన విజయం సాధించింది. ఈ సీజన్‌లో బెంగళూరుకు తొలి షాకిచ్చింది. బెంగళూరు నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలోనే ఛేదించి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సీజన్‌లో గుజరాత్‌కు ఇది రెండో విజయం కాగా, బెంగళూరుకు ఇదే తొలి ఓటమి.

వణికించిన సిరాజ్‌ భాయ్

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన జీటీ కెప్టెన్‌ గిల్ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన రజత్‌ పాటిదార్‌ నేతృత్వంలోని జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం 169 పరుగులు మాత్రమే చేయగలిగింది. న్నింగ్స్ ఆరంభంలోనే బెంగళూరుకు బిగ్ షాక్ తగిలింది. ఫామ్‌లో ఉన్న కోహ్లీని అర్షద్ ఖాన్ ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో వెనక్కి పంపాడు. విరాట్ డీప్‌ బ్యాక్‌వర్డ్ స్క్వేర్‌ లెగ్‌లో ప్రసిద్ధ్‌ కృష్ణకు చిక్కాడు. అనంతరం సిరాజ్‌ తన వరుస ఓవర్లలో పడిక్కల్, ఫిల్ సాల్ట్‌ను వెనక్కి పంపాడు. వీరిద్దరూ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగారు. 4.3 ఓవర్‌కు ఫిల్ సాల్ట్‌ భారీ సిక్స్‌ కొట్టగా అది స్టేడియం అవతల పడింది. తర్వాత బంతికే అతడిని ఔట్‌ చేసి సిరాజ్‌ రివెంజ్ తీర్చుకున్నాడు. ఒక దశలో 42 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోగా.. ఆర్‌సీబీని లివింగ్‌ స్టోన్‌ (54), జితేశ్‌ శర్మ (33) ఆదుకున్నారు. గుజరాత్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పరుగులు చేయడం కష్టంగా మారింది. చివరలో టిమ్‌ డేవిడ్‌ సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడడంతో బెంగళూరు ఆమాత్రం స్కోర్‌ చేయగలిగింది. జితేశ్‌ శర్మ (33; 21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), టిమ్ డేవిడ్ (32; 18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. విరాట్ కోహ్లీ (7), దేవ్‌దత్ పడిక్కల్ (4), కృనాల్ పాండ్య (5) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఫిల్ సాల్ట్ (14), రజత్ పటీదార్ (12) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. మహ్మద్‌ సిరాజ్‌కు మూడు వికెట్లు పడగొట్టగా.. సాయిసుదర్శన్‌కు రెండు, అర్షద్‌ ఖాన్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, ఇషాంత్‌ శర్మకు తలో వికెట్‌ దక్కింది.

అలవోకగా..

బెంగళూరు నిర్దేశించి 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌కు ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌, సాయిసుదర్శన్‌ శుభారంభం అందించారు. శుభ్‌మన్ గిల్ (14)ని భువనేశ్వర్‌ త్వరగానే వెనక్కి పంపగా.. సుదర్శన్, బట్లర్ నిలకడగా బౌండరీలు బాదడంతో గుజరాత్ పెద్దగా ఇబ్బంది లేకుండా లక్ష్యం దిశగా సాగింది. ఇద్దరు తొలి వికెట్‌కు 33 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. 14 బంతుల్లో ఒక ఫోర్‌, సిక్సర్‌తో 14 పరుగులు చేసిన శుభ్‌మన్‌ గిల్ భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో లివింగ్‌ స్టోన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత సాయిసుదర్శన్‌, జోస్‌ బట్లర్‌ కలిసి గుజరాత్‌ను విజయం నడిపించారు. ఇద్దరు కలిసి రెండో వికెట్‌కు హాఫ్‌ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఆ తర్వాత 36 బంతుల్లో ఏడు ఫోర్లు, సిక్సర్‌ సహాయంతో 49 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. దాంతో తృటిలో హాఫ్‌ సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. అర్ధ శతకానికి చేరువైన సుదర్శన్‌.. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ జితేశ్‌కు క్యాచ్ ఇచ్చాడు. అప్పటికే మ్యాచ్‌ గుజరాత్ చేతిలోకి వచ్చేసింది. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన రూధర్‌ఫోర్డ్ (30*; 18 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. బట్లర్ 31 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హేజిల్‌వుడ్ వేసిన 18 ఓవర్‌లో బట్లర్ వరుసగా రెండు సిక్స్‌లు బాది సింగిల్ తీయగా.. తర్వాత బంతికే రూథర్‌ఫోర్డ్ సిక్స్ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు.

Tags

Next Story