IPL: "బెంగ" తీరలేదు

గత కొన్ని ఐపీఎల్ సీజన్లుగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీం.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మెయిన్ విలన్ గా మారింది. శుక్రవారం రాత్రి లక్నో ఏకనా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లోను సూపర్ విక్టరీ సాధించి నేరుగా క్వాలిఫయర్స్ అర్హత సాధిద్దాం అనుకున్నా బెంగళూరు ఆశలపై నీళ్లు చల్లింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్ కు ఓపెనర్ అభిషేక్(37), ఇషాన్ కిషన్(94*) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. చివర్లో అనికేత్, కమ్మిన్స్ సిక్సర్లతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు భారీ స్కోర్ చేయగలిగారు. ఛేజింగ్ లో ఆర్సీబీకి ఓపెనర్లు సాల్ట్(62), కోహ్లీ(43) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చిన ఎషన్ మలింగ 15 ఓవర్లో మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశాడు. దీంతో ఆర్సీబీ 189 పరుగులకే తోక చుట్టేసింది.
దడపుట్టించిన కిషన్
ఈ సీజన్ లో నిలకడలేని ఫామ్ తో తడబడుతున్న ఇషాన్ కిషన్ ఎట్టకేలకు గాడిలో పడ్డాడు. ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. ఒకవైపు వికెట్లు పడుతున్న సిక్సర్లు, ఫోర్లతో చెలరేగి ఆడాడు. దీంతో 28 బంతుల్లోనే 50 పరుగుల మార్క్‌ను చేరుకున్నాడు. ఏ మాత్రం అడ్డగోలు షాట్లకు వెళ్లకుండా ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. మొత్తం 48 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 94 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు అభిషేక్ శర్మ (17 బంతుల్లో 34 పరుగులు; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), ట్రావిస్ హెడ్ (10 బంతుల్లో 17 పరుగులు; 3 ఫోర్లు) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. కేవలం 3.3 ఓవర్లలోనే వీరు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే, వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో వెనుదిరిగారు. అభిషేక్ శర్మను లుంగి ఎంగిడి అవుట్ చేయగా, ఆ తర్వాతి ఓవర్లోనే ట్రావిస్ హెడ్‌ను భువనేశ్వర్ కుమార్ పెవిలియన్ పంపాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. హెన్రిచ్ క్లాసెన్ (24; 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి మూడో వికెట్‌కు 48 పరుగులు జోడించాడు. క్లాసెన్ అవుటైన తర్వాత వచ్చిన అనికేత్ వర్మ (26; 9 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
ఇషాన్ కిషన్ ఒకవైపు వికెట్లు పడుతున్నా, మరోవైపు తనదైన శైలిలో పరుగులు రాబడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 28 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి (4), అభినవ్ మనోహర్ (12) త్వరగానే అవుటైనా, కెప్టెన్ పాట్ కమిన్స్ (13 నాటౌట్; 6 బంతుల్లో 1 సిక్సర్)తో కలిసి ఇషాన్ కిషన్ చివరి వరకు అజేయంగా నిలిచి జట్టు స్కోరును 230 పరుగులు దాటించాడు. సన్ రైజర్స్ జట్టు 8.4 ఓవర్లలో 100, 12.3 ఓవర్లలో 150, 17.5 ఓవర్లలో 200 పరుగుల మార్కును అందుకుంది. దాదాపు ప్రతి బ్యాటర్ తమ వంతు సహకారం అందించడంతో, సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ భారీ స్కోరు దిశగా సాగింది.
బెంగళూరు పోరాడినా...
సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 232 పరుగుల భారీ లక్ష్య ఛేదనను బెంగళూరు అద్భుతంగా ప్రారంభించింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (62), విరాట్ కోహ్లీ (43) దూకుడుగా ఆడారు. తొలి వికెట్‌కు ఏడు ఓవర్లలోపే 80 పరుగులు జోడించారు. కోహ్లీ ఔటైనా సాల్ట్ మాత్రం వేగంగా ఆడటంతో బెంగళూరు విజయం దిశగానే సాగింది. మయాంక్ అగర్వాల్ (11), రజత్ పటీదార్ (18) దూకుడు ప్రదర్శించలేకపోయారు. స్వల్ప వ్యవధిలో సాల్ట్, మయాంక్ వికెట్లను హైదరాబాద్ బౌలర్లు పడగొట్టారు. అయితే, రజత్‌తో కలిసి జితేశ్ శర్మ ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు ప్రయత్నించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 25 బంతుల్లోనే 44 పరుగులు రాబట్టారు. ఎప్పుడైతే రజత్ రనౌట్ రూపంలో ఔటయ్యాడో.. బెంగళూరు బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. డెత్ ఓవర్లలో (16 నుంచి 20) కేవలం 22 పరుగులే మాత్రమే ఇచ్చి ఏడు వికెట్లు పడగొట్టారు. భారీ హిట్టర్లు రొమారియో షెఫర్డ్ (0), టిమ్ డేవిడ్ (1) విఫలం కావడం బెంగళూరును దెబ్బతీసింది. కృనాల్ పాండ్య (8), భువనేశ్వర్ (3), యశ్ దయాల్ (3) త్వరగానే పెవిలియన్‌కు చేరారు. హైదరాబాద్ బౌలర్లలో కెప్టెన్ పాట్ కమిన్స్ 3, ఇషాన్ మలింగ 2.. జయ్‌దేవ్, హర్షల్ పటేల్, హర్ష్ దూబె, నితీశ్ తలో వికెట్ తీశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com