IPL: విదేశాల్లోనే ఐపీఎల్ మినీ వేలం

ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియ పూర్తయ్యాక, ఇప్పుడు అందరి దృష్టి వెంటనే రాబోయే మినీ వేలంపైనే నిలిచింది. డిసెంబర్ 16న అబుదాబీలో జరగబోయే ఈ వేలానికి ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. 19వ సీజన్ కోసం పది జట్లు మొత్తం 173 మందిని తమ స్క్వాడ్‌లో ఉంచుకున్నాయి. వీరిలో 49 మంది విదేశీ ఆటగాళ్లు. ఈసారి ముంబయి ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ ఎక్కువ సంఖ్యలో ప్లేయర్లను కొనసాగించడంతో, వేలంలో కేవలం 77 మంది మాత్రమే అమ్ముడయ్యే అవకాశం కనిపిస్తోంది. ఐపీఎల్ లో ఏ ఫ్రాంచైజీ అయినా కూడా.. తమ జట్టును బలోపేతం చేసుకోవాలని చూస్తుంటాయి. అందుకు తగ్గట్టుగానే భారీగా ధరను వెచ్చించి మరీ కొనుగోలు చేస్తుంటాయి. కొనుగోలు చేసిన ప్లేయర్స్ కొందరు నిరాశపరచడంతో మళ్లీ వారికి ఉద్వాసన పలకాల్సి వస్తుంది.
విదేశాల్లోనే వేలం
గత రెండేళ్లుగా విదేశాల్లో జరుగుతున్న ఈ వేలాన్ని ఈ సారి స్వదేశంలో నిర్వహించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఐపీఎల్ మినీ వేలం ఎక్కడ, ఎప్పుడు జరుగుతుందనే దానిపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది. ఐపీఎల్ 2026 మినీ వేలం ఈ సారి కూడా విదేశాల్లోనే జరగనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. డిసెంబర్ 16న అబుదాబిలో ఈ టోర్నీకి సంబంధించిన వేలం జరుగుతుందని తెలిపింది. అయితే విదేశాల్లో వేలం నిర్వహించడం ఇది మూడో ఏడాది. 2023లో దుబాయ్, 2024లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో వేలం వేశారు. డేంజరెస్ ప్లేయర్ ఆండ్రీ రసెల్‌ను కేకేఆర్ ఫ్రాంచైజీ రిలీజ్ చేసింది. ఆల్‌రౌండర్‌గా రసెల్ కేకేఆర్ జట్టు తరఫున అద్భుత ప్రదర్శన చేస్తూ వచ్చాడు.
టాప్ 5 ప్లేయర్స్ వీరే
ఈ టాప్ 5 ప్లేయర్స్ రిలీజ్ లిస్టు మిమ్మల్ని కొంచెం ఆశ్చర్యపరుస్తుంది.! ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా జట్టుకు మ్యాచ్ విన్నర్ గా నిలిచిన ఓ ప్లేయర్ కూడా ఇందులో ఉన్నాడు. అతడు మరెవరో కాదు ఆండ్రీ రస్సెల్. కేకేఆర్ మ్యాచ్ విన్నర్ అయిన రస్సెల్ ఈసారి మినీ వేలంలోకి రానున్నాడు. 2025 మెగా వేలానికి ముందుగా కేకేఆర్.. రస్సెల్ ను రూ. 12 కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకుంది. అయితే ఈసారి ఆ జట్టు అతడ్ని అనూహ్యంగా రిలీజ్ చేసింది. గత సీజన్లో అత్యధిక డబ్బు పెట్టి కొనుగోలు చేసిన బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్(రూ.23.75కోట్లు)ను కూడా కేకేఆర్ వదిలేసింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున సూపర్ బౌలింగ్ చేస్తూ విజయంలో కీలక పాత్ర పోషించే మహిశా పతిరణాను కూడా ఆ జట్టు రిలీజ్ చేసింది. ఆస్ట్రేలియన్ పవర్ హిట్టర్ మాక్స్‌వెల్‌ను పంజాబ్ కింగ్స్ విడుదల చేసింది. వేలంలో మొత్తం జట్లు కలిపి సుమారు రూ.237.55 కోట్లు వెచ్చించనున్నాయి. ఇందులో కోల్‌కతా నైట్ రైడర్స్ అత్యధికంగా రూ.64.3 కోట్ల పర్స్‌తో ముందుంది. కేకేఆర్ మొత్తం 13 మంది ప్లేయర్లను తీసుకునే ప్లాన్ చేస్తోంది, అందులో ఆరుగురు విదేశీ ప్లేయర్లు ఉండొచ్చు. రెండో పెద్ద బడ్జెట్ చెన్నై సూపర్ కింగ్స్‌దే — వారు రూ.43.4 కోట్లతో వేలంలో దిగుతున్నారు. ముంబై ఇండియన్స్ పర్స్‌లో రూ.2.75 కోట్లు మాత్రమే మిగిలాయి. పంజాబ్ కింగ్స్ వద్ద రూ.11.5 కోట్లు ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

